Sunday, October 6, 2024
Homeఆంధ్రప్రదేశ్Nandavaram: చంద్రబాబు అరెస్ట్ నిరసిస్తూ కొవ్వొత్తుల ర్యాలీ

Nandavaram: చంద్రబాబు అరెస్ట్ నిరసిస్తూ కొవ్వొత్తుల ర్యాలీ

చంద్రబాబుకు మద్దతుగా మేము సైతం అంటున్న తెలుగు తమ్ముళ్లు

టిడిపి జాతీయ అధ్యక్షులు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అరెస్టును నిరసిస్తూ టిడిపి జిల్లా ఉపాధ్యక్షులు మాధవరావు దేశాయ్ మండల కేంద్రంలో కొవ్వొత్తి ర్యాలీ నిర్వహించి, నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు లకు ప్రజల్లో వస్తున్న ఆదర అభిమానులను చూసి ఓర్వలేక ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి, వైసీపీ పార్టీ నాయకులు అక్రమ అరెస్టులకు పాల్పడుతున్నారని, దుర్మార్గమైన చర్యలను చూస్తున్న ప్రజలు రాబోవు రోజులలో వైసీపీ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతారని అంతేకాకుండా వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అక్రమ ఆగడాలకు ప్రజలు విసిగి చెందిపోయారని కావున రాబోవు రోజులలో వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దింపి తెలుగుదేశం పార్టీకి విజయాన్ని అందిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి కార్యకర్తలు బెస్ట్ ఈరన్న, పంపయ్య, శ్రీనివాసులు, మల్లికార్జున, వెంకటేష్, నరసింహులు, షరీఫ్, మోహన్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News