Sunday, October 6, 2024
HomeతెలంగాణAndole: బిజీగా ఆందోల్ ఎమ్మెల్యే

Andole: బిజీగా ఆందోల్ ఎమ్మెల్యే

బతుకమ్మ చీరలు పంపిణీ చేసిన క్రాంతి

ఆందోల్ నియోజకవర్గం మునిపల్లి మండల్ ఇబ్రహీంపూర్ గ్రామంలో జెడ్పి చైర్మన్ మంజుశ్రీ జయపాల్ రెడ్డితో కలిసి కమ్యూనిటీ హాల్, సిసి రోడ్డు పనులకు శంకుస్థాపన చేసి బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు ఆందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్.

- Advertisement -

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో నియోజకవర్గం మునుపెన్నడూ లేనివిధంగా తమ ప్రభుత్వం పనులు చేస్తోందన్నారు. తెలంగాణ వచ్చాక మన పండుగలకు గుర్తింపు వచ్చిందని, ఆడపడుచులకు బతుకమ్మ చీరల పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ ని ఘనంగా సన్మానించారు.

కాంగ్రెస్ నాయకులు పలువురు బిఆర్ఎస్ లో చేరారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి పైతేర మీనాక్షి సాయికుమార్, ఎంపీపీ గౌడిగామా శైలజ శివశంకర్ రాష్ట్ర నాయకులు పై తేరా సాయికుమార్ మండల అధ్యక్షులు విజయ్ కుమార్ కార్యదర్శి శశి కుమార్ యూత్ అధ్యక్షులు ఆనంద్ రావు సీనియర్ నాయకులు ప్రజాప్రతినిధులు టిఆర్ఎస్ నాయకులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News