Wednesday, October 2, 2024
HomeతెలంగాణHarish Rao: సిద్ధిపేట ప్రజల కల..నీళ్లు, రైలు, జిల్లా

Harish Rao: సిద్ధిపేట ప్రజల కల..నీళ్లు, రైలు, జిల్లా

సిద్ధిపేట కోరిక తీర్చిన కేసీఆర్

సిద్దిపేటకు రైలు రావడం గొప్ప ఆనందంగా ఉందని.. ఇక్కడి ప్రజల ట్యాగ్ లైన్ నీళ్లు, జిల్లా, రైలు. ఈ మూడు కోరికలను సీఎం కేసీఆర్ నిజం చేశారన్నారు మంత్రి హరీష్ రావు. గోదావరి జలాలను తీసుకువచ్చి దశాబ్దాల కలగా ఉన్న రైలును ప్రజలకు కానుకగా అందించారు. కాంగ్రెస్ బిజెపి ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో విఫలమయ్యారు. కరువు ప్రాంతమైన సిద్దిపేట జిల్లాలో కోనసీమగా మార్చింది సీఎం కేసీఆర్ జిల్లా ఆకాంక్షను నెరవేర్చింది సీఎం కేసీఆర్. 2006లో కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా ఉన్న కెసిఆర్ అప్పట్లోనే సిద్దిపేట రైల్వే లైన్ మంజూరు చేయాలని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి రైల్వే లైన్ ను మంజూరు చేయించారు. రైల్వే లైను మంజూరు చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం కొన్ని షరతులను వివరించండి రైల్వే లైన్ ఏర్పాటుకు అయ్యే మొత్తం బడ్జెట్లో 33% వాటాను రాష్ట్ర ప్రభుత్వం భరించాలని, భూసేకరణ మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే చేసి ఇవ్వాలనీ, నష్టాలలో ఐదు శాతం వాటాను భరించాలని షరతులు విధించారు. అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఈ షరతులకు ఒప్పుకోలేదు దీంతో రైల్వే ప్రాజెక్టు మరుగున పడింది. ఆ తర్వాత రోశయ్య కిరణ్ కుమార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అనేకసార్లు కేంద్ర ప్రభుత్వానికి సిద్దిపేట రైల్వే లైన్ గురించి లేఖ రాయాలని ఎన్ని మార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకున్న దాఖలాలు లేవు. మారింది కానీ ఇక్కడి ప్రాంత ప్రజల ఆకాంక్ష మాత్రం నెరవేరలేదు. తెలంగాణ ఉద్యమానికి పురిటిగడ్డ ఆయన సిద్దిపేట, తెలంగాణ ఉద్యమంలో మొట్టమొదటి జెడ్పి స్థానానికి కైవసం చేసుకున్న కరీంనగర్ ప్రాంతాలు , ఇక్కడి ప్రజలు అంటే వారికి కోపం ఉండేది. అందుకే అభివృద్ధి పనులలో జాప్యం చేస్తూ ప్రజల అవసరాలను పట్టించుకోకుండా కక్ష సాధింపు చర్యలు చేపట్టారు. కెసిఆర్ సీఎం కావడం తెలంగాణ ప్రాంత ప్రజల అదృష్టం కేసీఆర్ లేకపోతే ఈరోజు రైలు లేదు ఇంత అభివృద్ధి జరిగేది కాదు. ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్దిపేటకు రైలు రావాలని కలను నిజం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం రైల్వే శాఖ చెప్పిన షరతులన్నింటికీ అంగీకరించారు. సిద్దిపేట లైన్ తో పాటు అక్కన్నపేట మెదక్ రైల్వే లైన్ సైతం సీఎం కేసీఆర్ ప్రత్యేక కృషితో సాధించారు. సిద్దిపేట రైల్వే లైన్ కోసం రాష్ట్ర ప్రభుత్వం 2508 ఎకరాల భూసేకరణ జరిపింది. 310 కోట్ల రూపాయలను భూ సేకరణ కోసం రైతులకు చెల్లించింది. విద్యుత్ స్తంభాలు, మిషన్ భగీరథ పైపులు, ఇతర ఆస్తుల నష్టాన్ని సైతం లెక్కచేయకుండా అన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించింది. రైల్వే లైన్ నిర్మాణం కోసం రైల్వే శాఖకు 330 కోట్లను రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించింది. సిద్దిపేట రైల్వే లైన్ కోసం రాష్ట్ర ప్రభుత్వం 640 కోట్ల రూపాయలను ఖర్చు చేసి రైల్వే లైను సాధించింది.
కానీ ఈరోజు సొమ్ము ఒకరిది సోకొకరిది అన్నట్టుగా బిజెపి నాయకులు రైల్వే లైన్ ను తామే సాధించామని గొప్పలు చెప్పుకోవడం దుర్మార్గమైన చర్య. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రైల్వే లైన్ పనులను అటకెక్కించింది. ఇప్పుడు బిజెపి పార్టీ వచ్చి అబద్ధాలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. 640 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం భరించి ఒక ప్రాజెక్టును సాధిస్తే ఈరోజు రైలు ప్రారంభోత్సవంలో సీఎం కేసీఆర్ ఫోటో పెట్టకపోవడం దుర్మార్గమని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డికి నిన్న రాత్రి కేవలం ఫోను చేసి కార్యక్రమానికి రావాల్సిందిగా చెప్పి అవమానించారు. సిద్దిపేట జిల్లాకు రైలు తీసుకువచ్చేందుకు కోసం సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేశారని అన్నారు తాను సైతం అనేకమార్లు రైలు పట్టాల వెంబడి నడుచుకుంటూ వెళ్లి స్వయంగా పనులను పరిశీలించారని చెప్పారు. భూసేకరణ కోసం ఎదురైన ఇబ్బందులను తానే స్వయంగా ముందుండి పరిష్కరించాలని చెప్పారు. రైల్వే లైను నిర్మాణం కోసం కావలసిన భూమి కావాల్సి నా సమయంలో ఎంతోమంది రైతులను బ్రతిమాలి భూసేకరణకు ఒప్పించామని చెప్పారు. కాంగ్రెస్ బిజెపి నాయకులు ఏనాడైనా రైల్వే లైన్ నిర్మాణ పనులను కనీసం పరిశీలించారా అని ఎద్దేవా చేశారు. ఆనాడైనా ఈనాడైనా తెలంగాణ కోసం సిద్దిపేట జిల్లా రైల్వే లైన్ కోసం నిలబడ్డది సీఎం కేసీఆర్ మాత్రమేనని అన్నారు. సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతోనే రైలు వే సాధ్యమైంది ఆయన పట్టుదలతో కృషిచేసి రైలును పట్టాలెక్కించారు ఈరోజు పరుగులు పెట్టించారు…

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News