Saturday, October 5, 2024
Homeఆంధ్రప్రదేశ్Emmiganuru: కర్నూలు జిల్లాలో కరువు సహాయక చర్యలు చేపట్టండి

Emmiganuru: కర్నూలు జిల్లాలో కరువు సహాయక చర్యలు చేపట్టండి

ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డికి సిపిఐ విజ్ఞప్తి

2023 ఖరీఫ్ సీజన్ లో సకాలంలో వర్షాలు లేక పంటలు దెబ్బతిన్నాయని ఇటువంటి రైతులను గుర్తించి ఆడుకోవడానికి కర్నూలు జిల్లా కరువు ప్రాంతంగా ప్రకటించి కరువు సహాయక చర్యలు చేపట్టాలని సిపిఐ జిల్లా కార్యదర్శి బి గిడ్డయ్య కోరారు. స్థానిక ఎమ్మెల్యే నివాసంలో ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డిని ఏపి రైతు సంఘం, సీపీఐ బృందం కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా గిడ్డయ్య మాట్లాడుతూ ఖరీఫ్ లో రైతులు బ్యాంకులలో తీసుకున్న రుణాలను మాఫీ చేసి, వడ్డీ లేకుండా కొత్త రుణాలు ఇవ్వాలి. పంటల భీమా వర్తింపజేయాలి. టమోటా,వేరుశెనగ, జొన్న పంటలకు ఎకరాకు 30 వేలు , పత్తి కు 50 వేలు పరిహారం ఇవ్వాలి. ఎమ్మిగనూరు నియోజకవర్గ రైతుల కష్టాలను ముఖ్యమంత్రి జగన్ దృష్టి తీసుకెళ్లాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని చెన్నకేశవ రెడ్డి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సిపిఐ నాయకులు భాస్కర్ యాదవ్, పంపన్న గౌడ్, జి రంగన్న, బజారి, ఖాజా, ఇస్మాయిల్, మాలిక్, వీరేష్, మల్లికార్జున గౌడ్ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News