Saturday, October 5, 2024
Homeఆంధ్రప్రదేశ్Pathikonda: కరువు జిల్లాగా ప్రకటించి రైతుల ఆత్మహత్యలను నివారించాలి

Pathikonda: కరువు జిల్లాగా ప్రకటించి రైతుల ఆత్మహత్యలను నివారించాలి

శ్రీదేవికి విజ్ఞప్తి చేసిన కమ్యూనిస్టులు

కర్నూలు జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి కరువు సహాయక చర్యలు చేపట్టాలని పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు 40,000 నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో పత్తికొండ శాసన సభ్యురాలు కంగాటి శ్రీదేవమ్మకు వినతి పత్రం సమర్పించారు. అనంతరం సిపిఐ రైతు సంఘం బృందం సిపిఐ మండల కార్యదర్శి డి రాజా సాహెబ్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తాలూకా కార్యదర్శి కె .పెద్ద ఈరన్న మాట్లాడుతూ.. కర్నూలు జిల్లాలో ఖరీఫ్ సీజన్లో వర్షాలు కురవని కారణంగా రైతులు వేసిన ప్రధాన పంటలు పత్తి, వేరుశనగ, కంది, ఆముదము, జొన్న, కొర్ర తదితర పంటలు లక్షలాది హెక్టార్లలో సాగు చేశారు. వర్షాలు లేని కారణంగా మొలక దశలోనే పంటలు వాడిపోయి ఎండిపోయాయన్నారు. పంటలు సాగు చేయడానికి బ్యాంకుల్లో, ప్రైవేటు వ్యక్తుల దగ్గర అప్పులు చేసి, కట్టలేక ఆత్మహత్య చేసుకున్న పరిస్థితులు నిరంతరం చూస్తూ ఉన్నాం ఇప్పటికే వందల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి తీవ్రంగా నష్ట పోయారు. విత్తనాలు, ఎరువులు, సేద్యపు ఖర్చుల కోసం రైతుల పెట్టిన పెట్టుబడులు చిల్లిగవ్వ చేతికి రాక పోవడంతో నిరాశ నిస్పృహలతో ఆందోళన చెందుతూ తెచ్చిన అప్పులు కట్టలేక జిల్లాలో ఇప్పటికే అనేకమంది రైతులు గుండే పోటు తో మరియు పురుగులు మందు తాగి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. తక్షణమే రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఉంది, గ్రామాలలో పనులు లేక సుదూర ప్రాంతాలకు వలసపోయి అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే ఖరీఫ్ సీజన్ ముగిసిపోయింది. కాబట్టి ప్రభుత్వము జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి, కరువు సహాయక చర్యలు చేపట్టి, రైతులను, ప్రజలను ఆదుకోవడానికి తమరు ప్రభుత్వం మీద ఒత్తిడి చేయడానికి ఎమ్మెల్యేలు అధికారులు పంట పొలాలు పరిశీలించి కరువు సహాయక చర్యలు అంచనా వేసి, ప్రభుత్వానికి నివేదికలు పంపి, కరువు డిక్లేర్ చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జిల్లాలో అన్ని నియోజకవర్గాల శాసన సభ్యులకు వినతి పత్రాలు సమర్పిస్తున్నాం, కావున తమరు చొరవచేసి న్యాయం చేయాలని కోరారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి కే తిమ్మయ్య, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తాలూకా అధ్యక్షులు ఎం కారన్న ,సిపిఐ తుగ్గలి మండల కార్యదర్శి ఎస్ సుల్తాన్ ,దళిత పోరాట సమితి రాష్ట్ర నాయకులు గురుదాస్ ,ఎఐటియుసి తాలూకా అధ్యక్ష కార్యదర్శులు నెట్టికంటయ్య, రంగన్న ,సిపిఐ పట్టణ కార్యదర్శి రామాంజనేయులు ,వ్యవసాయ కార్మిక సంఘం తాలూకా అధ్యక్షులు వెంకట్రాం రెడ్డి, ఎఐటియుసి తాలూకా వర్కింగ్ ప్రెసిడెంట్ గుండు బాషా, ఏఐవైఎఫ్ తాలూకా అధ్యక్షులు పెద్దయ్య, సిపిఐ రైతు సంఘం నాయకులు వెంకట్ రాముడు, నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News