Wednesday, October 2, 2024
HomeతెలంగాణWarangal final voter list: వరంగల్ జిల్లా తుది ఓటర్ లిస్ట్ ఇదే

Warangal final voter list: వరంగల్ జిల్లా తుది ఓటర్ లిస్ట్ ఇదే

ఓటర్ జాబితా రిలీజ్ చేసిన వరంగల్ జిల్లా కలెక్టర్

కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు వరంగల్ జిల్లాలోని ఓటరు తుది జాబితా ప్రచురించినట్లు జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి పి ప్రావిణ్య నేడోక ప్రకటనలో తెలిపారు. బుధవారం విడుదల చేసిన తుది ఓటరు జాబితా ప్రకారం వరంగల్ జిల్లాలో మొత్తం 7,33,454 మంది ఓటర్లు ఉన్నారని,నర్సంపేట నియోజకవర్గంలో 2,26,617 మంది, వరంగల్ తూర్పు నియోజకవర్గంలో 2,46,282 మంది, వర్ధన్నపేట నియోజకవర్గంలో 2,60,555 ఓటర్లు ఉన్నట్లు వెల్లడించారు. వీరితో పాటు మూడు నియోజకవర్గాలలో కలిపి మొత్తం 590 మంది సర్వీస్ ఓటర్లు ఉన్నట్లు తెలిపారు.

- Advertisement -

ఈ జాబితాను కలెక్టరేట్, రెవెన్యూ డివిజనల్‌ అధికారి, తహసీల్‌ కార్యాలయాలతో పాటు అన్ని పోలింగ్ కేంద్రాలలో ప్రజల పరిశీలనార్థం అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపారు.
అలాగే అన్ని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు ఓటరు జాబితా కాపీని అందజేస్తామని చెప్పారు.

జిల్లాలో ఇంకా ఎవరైనా అక్టోబర్ 1 ,2023 నాటికి 18 సంవత్సరాలు నిండి ఓటరు జాబితాలో పేర్లు లేకుంటే వెంటనే ఓటరుగా నమోదు చేసుకోవాలని కలెక్టర్ , జిల్లా ఎన్నికల అధికారి పి ప్రావిణ్య తెలిపారు. నామినేషన్ల స్వీకరణ ముగింపు నాటికి ఓటరుగా నమోదు కావాలన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News