బండిఆత్మకూరు మండలంలోని బి. కోడూరు గ్రామములోని మండల పరిషత్ స్కూలు ఆవరణంలో జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిలుగా శ్రీశైలం నియోజకవర్గం శాసనసభ్యులు శిల్పా చక్రపాణిరెడ్డి, నియోజకవర్గం సమన్వయకర్త శిల్పా భువనేశ్వరరెడ్డి పాల్గొని వైద్య పరీక్షలు పరిశీలించారు. ఈ వైద్యశిబిరంలో జనరల్ ఫిజిషియన్, ఆర్హోఫెడిక్స్ స్పెషలిష్టు డాక్టర్లు మనోహరరెడ్డి, అవినాష్ పాల్గొని అందరికి ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించారు. ఎమ్మెల్యే శిల్పా మాట్లాడుతూ ..పేదలకు కార్పొరేట్ వైద్యం అందని ద్రాక్షలా ఉన్న ఈ కాలంలో ముఖ్యమంత్రి జగన్ రాష్ట్రంలో జగనన్న ఆరోగ్య సురక్ష అనే కార్యక్రమాన్నిప్రతిష్ఠంకంగా ప్రారంభించారన్నారు. మారుమూల ప్రాంత గ్రామాలకు స్పెషలిష్టు డాక్టర్లు చేరుకుని పేదలకు వారి ఇంటిదగ్గరే కార్పొరేట్ వైద్యం అందించి ఉచితంగా రోగికి సరిపడే మందులను అందిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ దేరెడ్డి చిన్న సంజీవరెడ్డి, జేసీఎస్ కన్వీనర్ ముడిమేల పుల్లారెడ్డి, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ విక్రమ సింహా నాయక్, వైస్ ఎంపీపీ రాగాల రమణ, ఎంపీడీఓ వాసుదేవగుప్తా, ఈఓఆర్డీ శ్రీనివాసుల, పంచాయితీ కార్యదర్శి జ్యోతి, ఎంపీటీసీ సుబ్బలక్ష్మమ్మ, సర్పంచి వెంకటజయలక్ష్మి, నాగేంద్ర, డా.భావన, డా.కిరణ్ కుమార్ వైద్య సిబ్బంది, ఐసిడిఎస్ అధికారి రమాదేవి వారి బృందం, గ్రామ నాయకులు మధు సూధన రెడ్డి తదితరులు పాల్గొన్నారు .
MLA Shilpa: పేదలందరికి మెరుగైన వైద్యం
స్పెషలిస్టులతో చికిత్సలు మీ గ్రామంలోనే
సంబంధిత వార్తలు | RELATED ARTICLES