Friday, September 20, 2024
HomeఆటKodimyala: జిల్లా స్థాయి క్రీడా పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే

Kodimyala: జిల్లా స్థాయి క్రీడా పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే

అన్ని రంగాలను అభివృద్ధి చేయటమే మా లక్ష్యం

జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలో ఎస్ జి ఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించే ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థాయి క్రీడా పోటీలను ప్రారంభించారు చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…కొడిమ్యాల మండల కేంద్రంలో మినీ స్టేడియం ఏర్పాటుకు కృషి చేస్తానని, గ్రామాల్లో క్రీడలను ప్రోత్సహించేందుకు క్రీడా కిట్లను ప్రభుత్వం తరఫున పంపిణీ చేస్తున్నామని, గ్రామాల్లో ఉన్న క్రీడాకారులను గుర్తించి వారిని ప్రోత్సహించడమే ముఖ్య ఉద్దేశమని, క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదం చేస్తాయన్నారు.
జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో క్రీడాకారులను తీర్చిదిద్దడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం పని చేస్తుందని, అన్ని రంగాలను కేసీఆర్ అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పని ఇస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, క్రీడాకారులు, స్థానికులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News