Friday, September 20, 2024
HomeNewsPraveen Kumar: ప్రగతి భవన్ పై బహుజన జండా

Praveen Kumar: ప్రగతి భవన్ పై బహుజన జండా

రానున్న ఎన్నికల్లో గెలిచి తీరాల్సిందే-ఆర్ఎస్ ప్రవీణ్

రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రగతి భవన్ పై నీలి జెండా ఎగరాలని బిఎస్పీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. కరీంనగర్ జిల్లా హుజరాబాద్ నియోజకవర్గం జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని ఎం పి ఆర్ గార్డెన్ లో బుధవారం సాయంత్రం ఏర్పాటు చేసిన బహుజన గర్జన సభలో ముఖ్యఅతిథిగా బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పాల్గొని సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికార బీఆర్ఎస్ పార్టీ ,కేంద్రంలోని బిజెపి పార్టీలో లోపాయికారి ఒప్పందంతో సమాజంలోని బహుజనులను అణగదొక్కాలని చూస్తున్నారని వారి కుయుక్తులను తిప్పుకొట్టే విధంగా బహుజనలంతా ఏకమై రానున్న సార్వత్రిక ఎన్నికల్లో అగ్రవర్ణ కుల అహంకారానికి ఓటు హక్కుతో సమాధానం చెప్పాలని ఆయన అన్నారు .అధికార బీఆర్ఎస్ పార్టీ బహుజనులకు దక్కాల్సిన హక్కులను కాలరాస్తూ బహుజనులను వారి బానిసలుగా చూస్తూ ఓటు బ్యాంకు రాజకీయాలకు తెర లేపుతూ బహుజనులను వారి రాజకీయ అవసరాల కోసం మాత్రమే వాడుకుంటున్నారని తీవ్రంగా దుయ్యబట్టారు .సమాజంలో ఒక్క శాతం ఉన్న అగ్రవర్ణ కులాలు 99 శాతం ఉన్న బహుజనులపై పెత్తనం చెలాయించడం ఇకనైనా మానుకోవాలని లేనియెడల ఓటు అనే ఆయుధం ద్వారా గుణపాఠం తప్పదని అన్నారు.

- Advertisement -

పార్లమెంట్ లో మోదీ చేస్తున్న నల్ల చట్టాలకు కెసిఆర్ సపోర్ట్…
పార్లమెంట్ లో ప్రధాని నరేంద్ర మోదీ అమలు చేస్తున్న నల్ల చట్టాలకు సపోర్టుగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నారని బిఎస్పి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. జమ్మికుంట పట్టణంలోని మోత్కులగూడెం చౌరస్తా నుండి గాంధీ చౌరస్తా వరకు బైక్ ర్యాలీ నిర్వహించి గాంధీ మహాత్ముడు, అంబేద్కర్ విగ్రహాలకు పూలమాల సమర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహుజన గర్జనలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సమక్షంలో జమ్మికుంట మండలంలోని తనుగుల ఎంపిటిసి వాసాల నిరోషా రామస్వామి తన అనుచరులతో పార్టీలో చేరారు. అనంతరం బీఎస్పీ పార్టీ అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ బిఆర్ఎస్, బిజెపి పార్టీలు రెండు ఒకటేనని, అగ్రవర్ణాలతోకలు కట్ చేసి పేద ప్రజలకు ప్రజాస్వామ్య బద్ధమైన పాలన అందించడమే బహుజన్ సమాజ్ పార్టీ లక్ష్యమని వెల్లడించారు. అక్రమ ఆస్తులు సంపాదిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవితలను ఎందుకు అరెస్టు చేయడం లేదని వారిపై ఈ డి, సి బి ఐ సోదాలు ఎందుకు జరగడం లేదని ప్రశ్నించారు. ఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రగతి భవన్ లో కూర్చుని గ్రామీణ ప్రాంతాలలోని ప్రజాప్రతినిధులకు వివిధ రకాల కార్పోరేషన్ పదవులు, కాంట్రాక్టులు ఇస్తున్నామని మభ్యపెడుతున్నారని రజమెత్తారు. స్థానిక ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి అసభ్య పదజాలంతో దూషించడమే కాకుండా పార్టీలో చేరిన వారిపై పోలీస్ కేసులు పెడతామని బెదిరిస్తున్నారని, కేసులకు భయపడి వెనుకకు తగ్గే ప్రసక్తి లేదని వెల్లడించారు. పేద బడుగు బలహీన వర్గాలు రానున్న రోజుల్లో బహుజన సమాజం కోసం ఎదురుచూస్తున్నారని వారి ఆశయాల మేరకు ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా చూడడమే బీఎస్పీ పార్టీ లక్ష్మన్నారు. 50 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో ప్రజలకు ఒరిగింది ఏమీ లేదని నేడు అనేక పథకాల రూపకల్పనతో గ్యారంటీలు ఇస్తున్నారని వాటిని ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. ఎస్సీ కార్పొరేషన్ నిధులను పూర్తిగా బంద్ చేసి దళిత బంధు పథకంతో ముఖ్యమంత్రి కేసీఆర్ దళితులను మోసం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బిఆర్ఎస్ పాలనతో ప్రజలు విసుకు చెంది ఉన్నారని పేర్కొన్నారు. హుజురాబాద్ ను పివి జిల్లాగా మార్చేందుకు బీఎస్పీ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు వెల్లడించారు. బీఎస్పీ పార్టీలో చేరిన వారిని బెదిరింపులకు గురి చేసినట్లయితే రాజ్యాధికారం తగ్గించుకున్న తర్వాత కేసులు పెట్టి జైలులో పెడతామని హెచ్చరించారు. మత కల్లోలాలను సృష్టించడమే బిజెపి పార్టీ లక్ష్యంగా పెట్టుకుందని, ప్రగతి భవన్ పై నీలి జెండా ఎగురవేస్తామని భీమా వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో ఆకనపల్లి శిరీష ,జన స్వరూప ,బండ సదానందం ,మారేపల్లి మొగులయ్య ,దొడ్డ సమ్మయ్య ,తోపాటు బహుజన సమాజ్ వాది పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు .

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News