ఈ నెల 2వ వారంలో ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా పూర్తయిన జగనన్న ఇళ్ళ కాలనీలను వర్చువల్ గా ప్రారంభించనున్న నేపథ్యంలో ఓర్వకల్లు జగనన్న ఇళ్ళ కాలనీని పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డితో కలిసి జిల్లా కలెక్టర్ డా. జి.సృజన పరిశీలించారు. ఇంటింటికీ విద్యుత్, నీటి సౌకర్యం కల్పించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. సోక్ పిట్ లను నిర్మించాలని సూచించారు. ఆర్చ్ కు రంగులు వేయాలని, కాలనీని అందంగా తీర్చిదిద్దాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట హౌసింగ్ పీడీ సిద్దలింగమూర్తి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నాగరాజు, ఎస్పీడిసీఎల్ ఎస్ ఈ ఉమాపతి, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ ఈ నాగేశ్వరరావు, ఓర్వకల్ ఎంపిడిఓ శివనాగ ప్రసాద్, ఓర్వకల్లు తహసీల్దార్ శివప్రసాద్ రెడ్డి, జడ్పిటిసి రంగనాథ్ గౌడ్, వార్డు మెంబర్ శంకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Kurnool: జగనన్న ఇళ్ల కాలనీపై కలెక్టర్ రివ్యూ
అందంగా, అన్ని అనుకూలాలతో ఇళ్లుండాలని ఆదేశం
సంబంధిత వార్తలు | RELATED ARTICLES