పాముల పాడు మండలం ఇస్కాల గ్రామంలో జరిగిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నందికొట్కూరు శాసన సభ్యులు తోగురు ఆర్థర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రసంగిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో భాగంగా నేడు పాముల పాడు మండలంలో ఇస్కాల గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద వైద్య సేవలు నిర్వహించామన్నారు. ఆరోగ్య సురక్ష ద్వారా కుటుంబ సభ్యులంతా ఆరోగ్యంగా ఉండాలని భావించి ఈ పథకం అమలు చేస్తున్నామన్నారు. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ప్రభుత్వమే అన్నిరకాల వైద్య పరీక్షలు నిర్వహించి, ఉచిత వైద్య సేవలు అందిస్తున్నామన్నారు.
కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మౌలాలి, ఎంపీపీ గురుసరోజిని వర్జీనియా, వైస్ ఎంపీపీ బండ్లమూరి వెంకటేశ్వర్లు, మండల కో ఆప్టెడ్ మెంబర్ మూర్తుజ అలీ, లింగాపురం గ్రామ సర్పంచ్ కలుబండి మారెన్న, మండల నాయకులు ముడియాల వెంకట రమణారెడ్డి వైసీపీ నాయకులు మాలిక్ భాష, పాణ్యం నాగిరెడ్డి, సత్యాలు, అంబన్న, నాగిరెడ్డి, భూమా రాములమ్మ, సుబ్బారెడ్డి, మురహరి రాజన్న, మారెన్న, బాలీస్వర్ రెడ్డి, శెట్టి.శివలింగం, భాష, కొత్తపల్లి మండలం వైసిపి నాయకులు సుగూరు సాయిరాం మండల అభివృద్ధి అధికారి గోపి కృష్ణ మండల తహసిల్దార్ రత్న రాధిక వైద్యులు నాగలక్ష్మి దేవి డా”గులాబ్ షా, డా. మౌనిక, డా. దీపిక, డా. ప్రతాప రెడ్డి, వైద్య సిబ్బంది, ఇతర వైసిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.