Sunday, October 6, 2024
HomeదైవంMannemkonda temple: వచ్చే ఏడాదికి మన్యం కొండ రోప్ వే రెడీ

Mannemkonda temple: వచ్చే ఏడాదికి మన్యం కొండ రోప్ వే రెడీ

50 కోట్లతో అంతర్జాతీయ స్థాయిలో రోప్ వే నిర్మాణం

మహబూబ్నగర్ జిల్లా పేదల తిరుపతిగా పేరుగాంచిన మన్నెంకొండ దేవస్థానం కొండపైకి వెళ్లేందుకు 50 కోట్ల రూపాయలతో చేపట్టనున్న రోప్ వే పనులకు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి .శ్రీనివాస్ గౌడ్ శంకుస్థాపన చేశారు.

- Advertisement -

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మన్నెంకొండలో రోప్ వే తో పాటు, అన్నదాన సత్రం, పార్కు, కళ్యాణకట్ట తదితర పనులు చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వానికి ప్రసాద్ పథకం కింద పంపించడం జరిగిందని, అయితే కేంద్రం నుండి అనుమతి రాకపోవడం కారణంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర నిదుల నుండి 50 కోట్ల రూపాయలు మంజూరు చేసి తక్షణమే రోప్ వే పనులను చేపట్టాలని ఆదేశించినట్లు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశం మేరకు 50 కోట్ల రూపాయలతో మన్యం కొండలో అంతర్జాతీయ స్థాయిలో రోప్ వే ను నిర్మిస్తున్నామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటి రోప్ వే అని, పొడవైన రోప్ వే కూడా మన్నెంకొండ రోప్ వే నిలుస్తుందని తెలిపారు. రోప్ వే తో పాటు, అన్నదాన సత్రం, క్లాక్ రూమ్స్, ప్రసాదం కౌంటర్లు, కళ్యాణకట్ట తదితర నిర్మాణాలను చేపట్టినట్టు మంత్రి వెల్లడించారు. రోప్ వే ను కలకత్తా నుండి రోప్ వే కన్ వేయర్స్ కంపెనీ రచన ముఖర్జీ టెండర్ వేయడం జరిగిందని, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రోప్ వే నిర్మాణాన్ని చేస్తున్నారని తెలిపారు. సంవత్సర కాలంలో మన్నెంకొండ రోప్ వే ను పూర్తి చేయాలని ఈ సందర్భంగా ఆయన కోరారు .వచ్చే సంవత్సరం నాటికి రోప్ వే పూర్తవుతుందని,దీని ద్వారా కొండపైకి కాలినడకన వెళ్లలేని ముసలి వారు, పిల్లలకు సౌకర్యంగా ఉంటుందని, అంతేకాక కొండపై రోప్ వే దిగిన వెంటనే దేవుడి వద్దకు లిఫ్ట్ ద్వారా వెళ్లే ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.


మన్నెంకొండ దేవాలయానికి ఎంతో ప్రాముఖ్యత ఉందని, తిరుపతికి వెళ్లలేని వారు మన్నెంకొండకు వస్తారని,” తీరితే తిరుపతి తీరకుంటే మన్నెంకొండ” అనే నానుడి చరిత్రలోనే ఉందని, అంతేకాక తిరుపతికి, మన్యంకొండకు ఎంతో సారూప్యత ఉందని ,మునులకొండ కాలక్రమేణా మారి మన్నెంకొండగా అయిందని అన్నారు.మన్యం కొండ ను పర్యాటకంగా అభివృద్ధి చేయడమే కాకుండా ,ఆధ్యాత్మికంగా కూడా అభివృద్ధి చేస్తామని, ఇక్కడే బడ్జెట్ హోటల్, ఇతర నిర్మాణాలను చేపట్టామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక శాఖ చైర్మన్ గేళ్ళు శ్రీనివాస్ యాదవ్, పర్యటకశాఖ ఎండి మనోహర్, రోప్ వే నిర్మాణ సంస్థ డైరెక్టర్ రచన ముఖర్జీ,సి ఈ వెంకట రమణ, మండల పరిషత్ అధ్యక్షురాలు సుధా శ్రీ ,వైస్ ఎంపీపీ అనిత, మన్నెంకొండ దేవస్థానం చైర్మన్ అలహరి మధుసూదన్ శర్మ, దేవస్థానం డైరెక్టర్లు ,డి ఈ పరుష వేది, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News