Friday, November 22, 2024
Homeఆంధ్రప్రదేశ్Kangati Sridevi: 'జగనన్న ఆరోగ్య సురక్ష'లో ఎమ్మెల్యే

Kangati Sridevi: ‘జగనన్న ఆరోగ్య సురక్ష’లో ఎమ్మెల్యే

అవసరమైతే ఆరోగ్య శ్రీకి రెఫర్ చేస్తారు

ప్రజల ఆరోగ్య పరిరక్షణ ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి అన్నారు. వెల్దుర్తి మండలం బింగిదొడ్డి గ్రామాలలో వైద్య సిబ్బంది నిర్వహిస్తున్న జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ఎమ్మెల్యే శ్రీదేవమ్మ పరిశీలించారు. వైద్య సిబ్బంది గ్రామాలకే వచ్చి అవసరమైన పరీక్షలు చేసి మందులు ఇస్తారని తెలియజేశారు. ప్రాథమిక వైద్య పరీక్షల అనంతరం అవసరమైతే ఆరోగ్యశ్రీ కింద పెద్ద ఆసుపత్రులకు కూడా రెఫర్ చేసి మంచి వైద్యం ఉండేలా చూస్తారని తెలియజేశారు. జగనన్న ఆశయాలకు అనుగుణంగా సేవలు అందించాలని వైద్యులకు సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ నాయకులు మాజీ జెడ్పిటిసి సమీర్ కుమార్ రెడ్డిజగన్మోహన్ రెడ్డి నాగార్జున రెడ్డి జెడ్పిటిసి సుంకన్న మరియు నాయకులు తాసిల్దార్ శివరాముడు ఎంపీడీవో శ్రీనివాసరావు ఈవో ఆర్ డి నరసింహులు అధికారులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News