బంగారు తెలంగాణలో ఆడపడుచులకు చిన్న చూపుచూస్తున్నారు అధికారులు. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో ఆడపడుచులకు చిన్న చూపు చూస్తూ అవమానించిన తాండూర్ మున్సిపల్ అధికారులపై మహిళా సంఘాల విరుచుకుపడుతున్నారు. వివరాల్లోకి వెళితే ప్రతి సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం ఆడపడుచులకు అందిస్తున్న బతుకమ్మ చీరలను తాండూరు మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నాయి. చీరలను పట్టణంలోని వార్డులలో రేషన్ దుకాణాలకు చెత్త ట్రాక్టర్, ఆటోలలో తరలించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు, మహిళా సంఘాలు మహిళలకు అందిస్తున్న బతుకమ్మ చీరలను చెత్త ట్రాక్టర్, ఆటోలలో ఉంచి తరలిస్తే… ఆ చీరలను మేము కట్టుకోవాలా ? మహిళా అధికారులు కూడా ఇవే చీరలు కట్టుకుంటారా? అని ప్రశ్నిస్తున్నారు స్థానికులు. మున్సిపల్ అధికారులు తాండూరు ఆడపడుచులకు క్షమాపణ చెప్పాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.