Friday, November 22, 2024
HomeదైవంBethamcharla: మద్దిలేటి స్వామి సన్నిధిలో శ్రీమహాలక్ష్మి అమ్మ వారి శరన్నవ రాత్రి ఉత్సవాలు

Bethamcharla: మద్దిలేటి స్వామి సన్నిధిలో శ్రీమహాలక్ష్మి అమ్మ వారి శరన్నవ రాత్రి ఉత్సవాలు

దసరా నవరాత్రులకు సిద్ధమైన మద్దిలేటి స్వామి గుడి

బేతంచెర్ల మండలం ఆర్ఎస్ రంగాపురం గ్రామ పరిధిలో వెలసిన ప్రముఖ వైష్ణవ పుణ్యక్షేత్రం లక్షలాది భక్తుల ఆరాధ్య దైవం శ్రీ మద్దిలేటీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం నందు 14-10-2023 నుండి 23-10-2023 వరకు శ్రీ మహాలక్ష్మి అమ్మవారి శరన్నవ రాత్రులు (దసరా) మహోత్సవములు నిర్వహింపబడునని దేవస్థానం కార్యనిర్వహణ అధికారి డి పాండురంగారెడ్డి, ధర్మకర్తల మండలి కమిటీ చైర్మన్ బి సీతారామ చంద్రుడు తెలిపారు. ఈ శనివారం స్వామి అమ్మ వార్లను దర్శించుకొనుటకు భక్తులు అధిక సంఖ్యలో హాజరై, వేకువజాము నుండే స్వామి, అమ్మ వార్లను దర్శించుకొని, వారివారి మొక్కులు చెల్లించుకున్నారు. గండాదీపాలు, పుట్టువెంట్రుకలు, తలనీలాలు, శ్రీవారి సేవాటికెట్లు, లడ్డు ప్రసాదములు, కేశకండనము, రూము బాడుగలు, లీజులు వసూళ్లు మొదలగు వాటి ద్వారా 1 లక్ష 99 వేల 195 రూపాయలు ఆదాయం సమకూరినట్లు కార్యనిర్వహణ అధికారి- చైర్మన్ తెలిపారు. భక్తులకు ఎటువంటి అసౌఖర్యాలు కలగకుండా దేవస్థానం సిబ్బంది ఆలయ ధర్మకర్తలు పర్యవేక్షిస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News