Saturday, April 12, 2025
HomeతెలంగాణWarangal: మీడియా సెంటర్ ప్రారంభించిన కలెక్టర్ ప్రావీణ్య

Warangal: మీడియా సెంటర్ ప్రారంభించిన కలెక్టర్ ప్రావీణ్య

జిల్లా కలెక్టరేట్‌లోని డిపిఆర్ ఓ కార్యాలయంలో ఏర్పాటుచేసిన మీడియా సెంటర్ , మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ సెల్ (ఎంసీఎంసీ) ను జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య మంగళవారం ప్రారంభించారు. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ఎప్పటికపుడు మీడియా సెంటర్ ద్వారా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కు అందించాలని సూచించారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లా స్థాయిలో మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. MCMC కమిటీ ద్వారా చెల్లింపు వార్తలను గుర్తించడం, ప్రచురణ , ముందస్తు అనుమతి లేకుండా ప్రకటనలను ప్రసారం చేయడం, సంబంధిత అభ్యర్థి ప్రచార వ్యయంలో వాటిని లెక్కించడం, సోషల్ మీడియాలో అభ్యర్థులు రాజకీయ పార్టీల ప్రకటనలకు వంటివి సకాలంలో ఆమోదం మంజూరు చేయాలని అన్నారు. వార్తాపత్రికలు, ఇ-పేపర్‌లు, టెలివిజన్ ఛానెల్‌లు, స్థానిక కేబుల్ నెట్‌వర్క్‌లు, సోషల్ మీడియా, మూవీ హౌస్‌లు మరియు SMSలు మరియు ఇతర ఆడియో-వీడియో విజువల్ మీడియాలతో సహా ప్రకటనలను MCMC నుండి ముందస్తు అనుమతి పొందిన తర్వాత మాత్రమే విడుదల చేయాలని ఈ సందర్భంగా కలెక్టర్ తెలిపారు. డిపిఆర్ ఓ ఆయుబ్ అలీ, ఆర్డీవో వాసు చంద్ర, ఆదనవు పీఆర్ ఓ ప్రేమలత, ఎలక్షన్ పర్యవేక్షకులు విశ్వ నారాయణ, జగదీశ్వర్, ఎంసీఎంసి సభ్యులు మెండు రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News