Friday, November 22, 2024
HomeతెలంగాణLakshmidevipeta: లక్ష్మీదేవిపేట మండలం అయ్యేనా?

Lakshmidevipeta: లక్ష్మీదేవిపేట మండలం అయ్యేనా?

100 రోజులుగా గ్రామస్థుల దీక్ష

వెంకటాపూర్ మండలంలో రెండో మేజర్ గ్రామ పంచాయతీగా గుర్తింపు పొందిన లక్ష్మీదేవిపేట కేంద్రంగా చుట్టూ ప్రక్కల గ్రామాలను కలుపుకుని నూతన మండలం ఏర్పాటు చేయాలని ఇక్కడి ప్రజలు కోరుతున్నారు. 1984లో టిడిపి ప్రభుత్వ హయాంలో ఎన్.టి రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే లక్ష్మీదేవిపేట మండల ఏర్పాటు జరిగేదని, కొన్ని రాజకీయ సమీకరణాల వల్ల వెంకటాపూర్ కేంద్రంగా మండల ఏర్పాటు జరిగిందని నాటి తరం పెద్దలు చెప్తుంటారు. మరల ఇప్పుడు లక్ష్మీదేవిపేట మండల ఏర్పాటు వాదం బలంగా వినిపిస్తోంది. గత సంవత్సరం అన్ని రాజకీయ పార్టీలు జేఎసి గా ఏర్పడి 100 రోజల రిలే నిరాహార దీక్షలు కూడా నిర్వహించారు. మంత్రుల దృష్టి కి తీసుకెళ్ళారు. అతి చిన్న జిల్లాగా ఏర్పడిన ములుగు జిల్లాలో మల్లంపల్లితో పాటుగా లక్ష్మీదేవిపేట కూడ మండలం అవుతుందని అనుకున్నారు. కానీ నిరాశే మిగిలింది. లక్ష్మీదేవిపేట చుట్టూ ప్రక్కల గ్రామాలు నల్లగుంట, నర్సింగాపూర్, లక్ష్మిపురం, బూర్గుపేట, చక్రవర్తిపల్లి, నారాయణపూర్, మల్లయ్యపల్లి, గుర్రంపేట, రాంనాయక్ తండా, సుబ్బక్కపల్లి, బావ్సింగ్ పల్లి, పెద్దాపూర్, కొండాపూర్, సీతారాంపురం 15 గ్రామాలతో నూతన మండల ఏర్పాటు జరిగితే ప్రజలకు మండల కేంద్రము అందుబాటులో ఉంటుంది అనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది. అన్ని రకాల వనరులు ఉండి చుట్టూ ప్రక్కల గ్రామాల ప్రజలకు వ్యాపార, వాణిజ్య పరంగా అందుబాటులో ఉన్న లక్ష్మీదేవిపేట మండల ఏర్పాటుకి ఈ ఎన్నికల్లో ఐన హామీ ఇస్తారో లేదో వేచి చూడాలి.

- Advertisement -

ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తాం:

మండల సాధన సమితి అధ్యక్షులు …అంతటి రాము గౌడ్

గతంలోనే లక్ష్మీదేవిపేట కేంద్రంగా మండల ఏర్పాటు జరిగేదని, చుట్టూప్రక్కల 15 గ్రామాల ప్రజలు మండల ఏర్పాటు కోరుతున్నట్టు వరంగల్ శాసన మండలి సభ్యులు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి దృష్టికి తీసుకెళ్ళామని వారు ముఖ్యమంత్రి గారికి ఇక్కడి ప్రజల డిమాండ్ తెలియపరచి ఈ ఎన్నికల్లో హామి ఇప్పిస్తామని అన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News