హుస్నాబాద్ గడ్డ సీఎం కేసీఆర్ ఎన్నికల సమర శంఖారావం పూరించడానికి మరొకసారి వేదిక కాబోతుంది, 2018లో సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచారాన్ని తన లక్ష్మీ నియోజకవర్గంగా చెప్పుకునే హుస్నాబాద్ నియోజకవర్గం నుండి ఎన్నికల సన్నాహక సభ నిర్వహించి ప్రారంభించారు. ఈసారి అక్టోబర్ 15వ తేదీ ఆదివారం రోజున మధ్యాహ్నం 3:00 గంటలకు హుస్నాబాద్ విద్యుత్ సబ్ స్టేషన్ పక్కన లక్ష మందితో నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభతో హుస్నాబాద్ గడ్డ నుండి ఎన్నికల ప్రచారాన్ని సీఎం కేసిఆర్ ప్రారంభించనున్నారు. మంత్రి హరీష్ రావు, ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బి.వినోద్ కుమార్, హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ లతో కలిసి స్థల పరిశీలన చేసి అనంతరం కార్యకర్తల సమావేశంలో ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బి వినోద్ కుమార్ మాట్లాడుతూ బీఆర్ఎస్ కార్యకర్తలందరూ సైనికులవలే పనిచేసి ప్రజాఆశీర్వాద సభను విజయవంతం చేయాలని కోరారు. మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం సుస్థిరమైన ప్రభుత్వమని దేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి అనేక సంక్షేమ పథకాలను అమలు చేసి అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి కృషి చేస్తున్నామని అనేక సంక్షేమ పథకాలతో నేడు దేశానికే రోల్ మోడల్ గా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దుకున్నామని, దక్షిణ భారతదేశ ధాన్యాగారంగా తెలంగాణ రాష్ట్రం అవతరించిందని ఈరోజు దేశంలోనే వరి ఉత్పత్తిలో నెంబర్ వన్ స్థానంలో ఉందని, కాళేశ్వరం నీటితో తెలంగాణ సస్యశ్యామలమైందని అన్నారు ఇదే స్ఫూర్తితో హ్యాట్రిక్ విజయాన్ని సాధిస్తామని ప్రజలందరి ఆశీర్వాదం సీఎం కేసీఆర్ పైన, బీఆర్ఎస్ ప్రభుత్వం పైన ఉందని అన్నారు. ప్రతిపక్ష పార్టీలది కల్లబొల్లి కబుర్లు తప్ప వారు ప్రజలకు చేసింది ఏమీలేదని ప్రజలందరూ అన్ని గమనించాలని కాంగ్రెస్ అంటే మాటలు, మూటలు, మూఠాల పార్టీ అని దుయ్యబట్టారు.
హుస్నాబాద్ నియోజకవర్గం ఒకప్పుడు కరువు పీడిత ప్రాంతం కల్లోలిత ప్రాంతమని నేడు అభివృద్ధికి చిరునామాగా మారిందని ఎమ్మెల్యే సతీష్ కుమార్ వేల కోట్లతో హుస్నాబాద్ నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేశారని, హుస్నాబాద్ నియోజకవర్గ చిరకాల వాంఛ గౌరవెల్లి ప్రాజెక్టును పూర్తి చేశారని ప్రజలందరూ మరొకసారి సతీషన్న ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. అక్టోబర్ 15వ తేదీన సీఎం కేసీఆర్ ఎమ్మెల్యే అభ్యర్థులకు బి-ఫాంలు అందించి బీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసి మొట్టమొదటి ఎన్నికల సభ హుస్నాబాద్ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొంటారని హుస్నాబాద్ ప్రజా ఆశీర్వాద సభ నుండి సీఎం కేసీఆర్ ప్రజలకు తీపి కబురు చెబుతారని హరీష్ రావు అన్నారు. హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్ మాట్లాడుతూ హుస్నాబాద్ నియోజకవర్గం నుండి మరొకసారి సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉందని లక్ష మందితో అక్టోబర్ 15న ప్రజా ఆశీర్వాద సభ నిర్వహిస్తున్నామని, హుస్నాబాద్ నియోజకవర్గం లోని ప్రతి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సైనికులవలె పనిచేసి సభను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ నియోజకవర్గ అన్ని మండలాల ముఖ్య నాయకులు, కార్యకర్తలు, హుస్నాబాద్ మున్సిపల్ నాయకులు హాజరయ్యారు.