Saturday, November 23, 2024
HomeతెలంగాణCheryala: డివిజన్ సాధించేంతవరకు ఫోటో, వీడియో గ్రాఫర్ల పోరాటం

Cheryala: డివిజన్ సాధించేంతవరకు ఫోటో, వీడియో గ్రాఫర్ల పోరాటం

రెవెన్యూ డివిజన్ సాధనకై దీక్షలో ఫోటో వీడియో గ్రాఫర్లు

చేర్యాల రెవెన్యూ డివిజన్ సాధించేవరకు ఫోటో, వీడియో గ్రాఫర్ల పూర్తి మద్దతు ఉంటుందని ఫోటో, వీడియో గ్రాఫర్ యూనియన్ జిల్లా అధ్యక్షులు డొంతుల శ్రీకాంత్ అన్నారు. చేర్యాల రెవెన్యూ డివిజన్ సాధనకై చేస్తున్న దీక్షలు మంగళవారం నాటికి 30వ రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్షల్లో నాలుగు మండలాల ఫోటో, వీడియో గ్రాఫర్ అసోసియేషన్ నాయకులు కూర్చున్నారు. వారికి వివిధ పార్టీల నాయకులు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చేర్యాల రెవెన్యూ డివిజన్ సాధన కోసం జేఏసీగా కొన్ని సంవత్సరాలుగా అనేక పోరాటాలు నిర్వహిస్తుంటే ప్రభుత్వంలో ఎలాంటి చలనం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగు మండలాల ప్రజల చిరకాల కోరిక ఆకాంక్షను ప్రభుత్వం వెంటనే గుర్తించి రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. ఈ ఉద్యమంలో వీడియో, ఫోటోగ్రాఫర్లు సంపూర్ణ మద్దతు తెలుపుతూ భాగస్వాములు అవుతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఫోటో వీడియో గ్రాఫర్స్ యూనియన్ అధ్యక్షులు గుడాల రాజు, ప్రధాన కార్యదర్శి ఇప్పకాయల పవన్, కోశాధికారి కోయినేని శ్రీనివాస్, గౌరవ అద్యక్షలు రాజగిరి గోవర్ధన్, కడుదూరి మహేందర్ రెడ్డి, కర్క చంద్రారెడ్డి, కొమురవెల్లి అధ్యక్షులు చిప్ప శ్రీనివాస్, ధూల్మిట్ట అధ్యక్షులు గొంటిపల్లి కిషన్, కూరపాటి మదు, తాడెం యాదగిరి, నర్సింగరావు, హరి, సురేష్, కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News