జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాలను ప్రజలు వినియోగించుకోవాలని ఎమ్మెల్యే తోగూర్ ఆర్థర్ అన్నారు. జూపాడుబంగ్లా మండలంలోని మండ్లెం గ్రామ సచివాలయం.2 ఆవరణలో జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరం పరిశీలించారు. వైద్యులు ప్రజలకు అందిస్తున్న వైద్య సేవలను చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆర్థర్ మాట్లాడుతూ ప్రజా రోగ్యానికి రక్షణ కల్పించడమే జగనన్న ఆరోగ్య సురక్ష లక్ష్యమని అన్నారు. ప్రజల ఆరోగ్య రక్షణే… జగనన్న లక్ష్యం అని అన్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష హెల్త్ క్యాంపులో ప్రజలందరికీ డాక్టర్లు వైద్య పరీక్షలు ఉచితంగా నిర్వహించి మందులు అందజేస్తారని అన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని తమ ఆరోగ్యాలను రక్షించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సువర్ణమ్మ, వైసీపీ నాయకులు భాస్కర్ రెడ్డి, సురేంద్ర రెడ్డి, తంగడంచ ఈదుల కరుణాకర్ రెడ్డి, జంగాల పెద్దన్న, హనుమంత్ రెడ్డి, తాటిపాడు కృష్ణారెడ్డి, పోతులపాడు శివానందరెడ్డి, పారుమంచాల దేవ సహాయం, నందికొట్కూర్ ఉండవల్లి ధర్మారెడ్డి, తమ్మడపల్లె విక్టర్, తాసిల్దార్ బి పుల్లయ్య యాదవ్, ఈ వో ఆర్ డి చక్రవర్తి, ఎంపీడీవో నూర్జహాన్, వైద్యాధికారులు, వైద్య సిబ్బంది ఇతర వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Jupadubangla: జగనన్న ఆరోగ్య సురక్షతో ప్రజలకు మేలు
వైద్య పరీక్షలు, మందులు అంతా ఫ్రీ
సంబంధిత వార్తలు | RELATED ARTICLES