Saturday, October 5, 2024
Homeఆంధ్రప్రదేశ్Nandavaram: చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ జల దీక్ష

Nandavaram: చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ జల దీక్ష

బాబుకు మద్దతుగా దీక్ష

టిడిపి జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అరెస్టును నిరసిస్తూ మండల టిడిపి నాయకులు, కార్యకర్తల ఆధ్వర్యంలో మండల పరిధిలోని నాగలదిన్నె గ్రామ సమీపానగల తుంగభద్ర నదిలో జల దీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర బీసీ సెల్ ఉపాధ్యక్షులు ఈరన్న గౌడ్, మండల క్లస్టర్ ఇంచార్జ్ కాశీం వలి, మండల టిడిపి నాయకులు గురురాజ్ దేశాయ్, టిడిపి జిల్లా మాజీ ఉపాధ్యక్షులు నాగరాజ్ గౌడ్, మండల కన్వీనర్ చిన్న రాముడు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ను అక్రమ కేసులో అరెస్టు చేస్తే పార్టీలోని నాయకులు, కార్యకర్తలు మానసిక ఒత్తిడిలకు లోనై పార్టీ విచ్ఛిన్నం అవుతుందన్నారు.

- Advertisement -

వైసిపి ప్రభుత్వం చేసే ఈ తాటాకు చప్పులకు టిడిపి నాయకులు, కార్యకర్తలు భయపడే ప్రసక్తే లేదని ధీమా వ్యక్తంచేశారు. చంద్రబాబు నాయుడు కూడా త్వరలో నిర్దోషిగా విడుదలై మచ్చలేని చంద్రుడి వలె బయటికి వస్తాడని రాబోయే ఎన్నికల్లో విజయం సాధించి ముఖ్యమంత్రిగా మరల రాష్ట్ర, దేశ రాజకీయాలను శాసిస్తాడని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు గోపాల్, రామకృష్ణారెడ్డి, బాలరాజు, మిట్ట సోమపురం వీరేష్, ఆదిశేషు, ఈరన్న, కైరవడి వీరేష్, మాజీ సర్పంచ్ రామన్న గౌడ్, బెస్త ఈరన్న, మల్లికార్జున, వెంకటేష్, నరసింహులు, కనకవీడు ఈరన్న, సుభాన్ తదితర టిడిపి మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News