Thursday, September 19, 2024
Homeపాలిటిక్స్Harish Rao: లీడర్లిద్దరూ కలిశారు కాబట్టి కార్యకర్తల్లో గొడవలొద్దు

Harish Rao: లీడర్లిద్దరూ కలిశారు కాబట్టి కార్యకర్తల్లో గొడవలొద్దు

లక్ష ఓట్ల మెజారిటీతో పల్లాను గెలిపించండి

ఈ నెల 16వ తేదీన జనగామ జిల్లా కేంద్రంలో సీఎం కెసిఆర్ భారీ బహిరంగ సభ నేపధ్యంలో జనగామ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సన్నాహక సమావేశానికి హాజరయ్యారు మంత్రి తన్నీరు హరీష్ రావు. ఈ కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, స్థానిక ఎమ్మెల్యే ఆర్టీసీ చైర్మన్ ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే రైతు సమన్వయ సమితి చైర్మన్ రాజయ్య, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.

- Advertisement -

మంత్రి హరీశ్ రావు కామెంట్స్:

జనగాంలో ఎంట్రీతోనే అద్భుతమైన విజయం సాధించే దిశగా సాగుతున్న రెడ్డి గారికి శుభాకాంక్షలు.

కెసిఆర్ కు జనగామంటే చాలా ప్రేమ. జనగామ ప్రజల ఉద్యమ స్ఫూర్తిని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చూశారు.

తెలంగాణ ఉద్యమానికి పోరు గడ్డ జనగామ ప్రాంతం.

పెద్ద మనసుతో పల్ల రాజేశ్వర్ రెడ్డిని ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ఆశీర్వదించడమే కాకుండా భవిష్యత్తులో చేయాల్సిన పనుల బాధ్యతను అప్పగించారు.

సూర్యాపేట జిల్లాకు చెందిన వేణుగోపాల్ రెడ్డి అనే విద్యార్థి 2010 లో ఉస్మానియా యూనివర్సిటీలో కాంగ్రెస్, బిజెపి ఎమ్మెల్యేలు తెలంగాణ కోసం రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఆత్మహత్య చేసుకొని అమరుడయ్యాడు.

విద్యార్థి మృతదేహాన్ని తరలించే క్రమంలో పోలీస్ లాఠీచార్జిల మధ్యలో తొలిసారి పరిచయమైన వ్యక్తి పల్లా రాజేశ్వర్ రెడ్డి.

తెలంగాణ ఏర్పాటు తర్వాత ఎమ్మెల్సీగా, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడిగా అనేక బాధ్యతలతో ముఖ్యమంత్రికి సన్నిహితంగా ఉన్న పల్లా రాజేశ్వర్ రెడ్డి జనగామ బాధ్యతలు చేపట్టడం సంతోషకరమైన విషయం.

పల్లా రాజేశ్వర్ రెడ్డిని లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించాలని మంచి మనసుతో దీవించారు ముత్తిరెడ్డి యాదగిరి గారు. ఇది బీఆర్ఎస్ సంస్కృతి.

అదే కాంగ్రెస్ పార్టీ అయితే గ్రూపులు, కొట్లాటతో కుర్చీల కోసం మత కల్లోహాలు సృష్టించే పార్టీ కాంగ్రెస్.

కాంగ్రెస్ పార్టీకి 11సార్లు అవకాశం ఇచ్చినా చేయలేని పనులు 10 ఏళ్లు నిండకముందే కేసీఆర్ చేసి చూపించాడు.

కాంగ్రెస్ పాలనకు బీఆర్ఎస్ పాలనకు చర్చకు సిద్ధమంటున్నడు ఒక కాంగ్రెస్ నాయకుడు. కాంగ్రెస్ పాలన అంటే కరువులు, కర్ఫ్యూలు, కరెంట్ కోతలు.

అదే బీఆర్ఎస్ ధాన్యం ఉత్పత్తిలో డాక్టర్ ల ఉత్పత్తిలో నెంబర్ వన్. రైతులకు 24 గంటలు కరెంటు ఇచ్చుడులో నెంబర్ వన్, రైతు బంధువులో నెంబర్ వన్, రైతు బీమాలో నెంబర్ వన్, ప్రతి ఇంటికి మంచినీళ్లు అందించడంలో నెంబర్ వన్.

కాంగ్రెస్ పార్టీ 2009లో ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు.

ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పిన, చెప్పని హామీలను నెరవేర్చిన నాయకులు.

ఎన్నికల హామీలో లేని రైతుబంధు చేసిండు ఇంటింటికి మిషన్ భగీరథ మంచినీళ్లు ఇవ్వడం ఇలా ఒకటి కాదు అనేక కార్య్రమాలు చేసి చూపించాడు.

కర్ణాటకలో కాంగ్రెస్ అమలు చేయని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి చేతులు ఎత్తేశారు.

జనగామలో గెలుపు విషయంలో అనుమానం లేదు మెజార్టీ ఎంత అనేది ముఖ్యం. సిద్దిపేటలో నాతో పక్కన దయాకర్ రావుతో పోటీ పడాల్సిందే.

అన్ని వర్గాలను కలుపుకొని ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సభ ను లక్ష మందితో విజయవంతం చేసుకుందాం.

నాయకులు ఇద్దరు కలిసి పోయారు కాబట్టి కార్యకర్తలు కూడా మనస్పర్ధలు లేకుండా కలిసి పనిచేయాలని కోరుకుంటున్నాను.

ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి గారికి ఆర్టీసీ చైర్మన్ పదవి ఇచ్చి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గౌరవించారు.

యాదన్నలాగా జనగామని కంటికి రెప్పలా కాపాడుకునే మరో నాయకుడు దొరికాడు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News