తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా జరగనున్న శాశనసభ ఎన్నికల దృష్ట శాంతి భద్రతల పరిరక్షణ కోసం జగిత్యాల-నిర్మల్ జిల్లాల సరిహద్దు గ్రామమైన ఓబులాపూర్ లో చెక్ పోస్ట్ ను జిల్లా ఎస్పీ భాస్కర్ ఏగ్గడి భాస్కర్ ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎస్పి మాట్లాడుతూ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు ప్రతి ఒక్కరు కృషిచేయాలనీ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని, ఏదైనా సంఘటన జరిగితే పోలీసులకు తెలియజేయాలనీ, ఎన్నికల దృష్ట్యా యాభై వేయిల కంటే ఎక్కువ డబ్బులు వెంట తీసుకవస్తే.. దానికి సంబంధించిన పత్రాలను పోలీసు సిబ్బందికి చూయించి సహకరించాలని ఎస్పీ భాస్కర్ కోరారు.
పోలీసు సిబ్బంది నిరంతరం చెక్ పోస్ట్ వద్ద ఉంటారని, చెక్ పోస్ట్ వద్ద ఉండే సిబ్బంది కోసం శాశ్వత చెక్ పోస్ట్ ను ఏర్పాటు చేసినట్లు ఎస్పి తెలిపారు. ఇట్టి కార్యక్రమం లో డిఎస్పి రవీందర్ రెడ్డి , సీఐ లక్ష్మి నారాయణ,మల్లాపూర్ ఎస్సై నవీన్ కుమార్, ఇబ్రహీంపట్నం, మెట్ పల్లి ఎస్సై లు, మల్లాపూర్ పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.