Saturday, October 5, 2024
HomeదైవంKurnool Collector: బన్నీ ఉత్సవాన్ని ప్రశాంతంగా నిర్వహించుకోండి

Kurnool Collector: బన్నీ ఉత్సవాన్ని ప్రశాంతంగా నిర్వహించుకోండి

ఈ నెల 24 న దేవరగట్టు బన్ని ఉత్సవం

ఈ నెల 24 న దేవరగట్టు బన్ని ఉత్సవాన్ని ప్రశాంతంగా నిర్వహించుకోవాలని దేవాలయ కమిటీ సభ్యులకు సూచిస్తూ ఉత్సవాల నిర్వహణకు తగిన వసతులను కల్పించాలని జిల్లా కలెక్టర్ డా.జి.సృజన అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ లో దేవరగట్టు బన్ని ఉత్సవ ఏర్పాట్ల పై ఎస్పీ జి. కృష్ణకాంత్, ఆదోని సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్ తో కలిసి అధికారులు, దేవస్థాన కమిటీ సభ్యులతో సమీక్షించారు. ముందుగా ఆదోని సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్ ఉత్సవ ప్రాముఖ్యత ను గురించి వివరించారు. బన్ని ఉత్సవాలు గా ప్రసిద్ధి గాంచిన శ్రీశ్రీశ్రీ మాళా సహిత మల్లేశ్వర స్వామి దసరా ఉత్సవాలు ఈ నెల 19-28 వరకు హోళగుంద మండలం దేవరగట్టులో జరగనున్నాయని, 80 వేల నుండి లక్షన్నర మంది ఈ ఉత్సవాలలో పాల్గొననున్నారని తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఉత్సవాలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. శాంతి, భద్రతలకు ఎటువంటి విఘాతం కలగకుండా చూసే బాధ్యత అందరిపై ఉందని పేర్కొన్నారు. చట్టాన్ని అతిక్రమించకుండా, పండుగలో పాల్గొనాలని ప్రజలకు పిలుపునిచ్చారు. దేవరగట్టు, సమీప ప్రాంతాలలో బన్ని ఉత్సవం రోజున మద్యం అమ్మకాల పై నిషేధం ఉంటుందని తెలియజేశారు. వంద వరకు సి.సి.టి.వి కెమెరాలు, హైమాస్ లైట్లు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. దేవాలయంలో ఐరన్ బ్యారికేడ్ల ఏర్పాటు చేయాలని ఆర్ అండ్ బి అధికారులను ఆదేశించారు. ఏ ఏ రోడ్లకు మరమ్మతులు అవసరమో వాటి వివరాలు ఇస్తే వాటిని మరమ్మతులు చేస్తామని ఆదోని డిఎస్పీ కి సూచించారు. సత్వర వైద్యసేవలకై అడ్వాన్స్ లైఫ్ సపోర్ట్ కలిగిన 4 అంబులెన్సు లు ఏర్పాటు చేయాలని డిఎంహెచ్వో డా. రామ గిడ్డయ్య ను ఆదేశించారు. డాక్టర్లు, వైద్య సిబ్బందిని నియమించాలని సూచించారు. పారిశుద్ధ్యం, నీటి వసతి, విద్యుత్ సౌకర్యం కల్పించాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. అగ్నిమాపక వాహనాలను అందుబాటులో ఉంచాలని ఫైర్ శాఖ అధికారులను ఆదేశించారు. ఈ నెల 18 న దేవరగట్టు లో ఏర్పాట్లపై మళ్ళీ సమీక్ష నిర్వహిస్తామని కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి మధుసూదన రావు, పత్తికొండ ఆర్డీవో మోహన్ దాస్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News