Friday, November 22, 2024
Homeఆంధ్రప్రదేశ్Chandrababu health: ఇంతకీ చంద్రబాబు ఆరోగ్యం ఎలా ఉంది?

Chandrababu health: ఇంతకీ చంద్రబాబు ఆరోగ్యం ఎలా ఉంది?

బాబు అభిమానుల్లో టెన్షన్

చంద్రబాబు ఆరోగ్యం బాగుందా లేదా .. ఇది ఇప్పుడు తెలుగువారు చర్చించుకుంటున్న హాట్ టాపిక్. ఓవైపు చంద్రబాబు స్కిన్ అలర్జీ కారణంగా డీ హైడ్రేషన్ తో బాధపడుతున్నారని జైలు అధికారులు చెబుతున్నారు. మరోవైపు చంద్రబాబు అనారోగ్యంతో బాధపడుతున్నారని, ఆయన ఏకంగా 5 కేజీల బరువు తగ్గిపోయారని చంద్రబాబు కోడలు బ్రాహ్మణి చేసిన ట్వీట్ ఆయన అభిమానుల్లో టెన్షన్ పుట్టిస్తోంది.

- Advertisement -

చంద్రబాబుకు చికిత్స చేసేందుకు జైల్లోకి ఆయన వ్యక్తిగత వైద్యులను అనుమతించాలని టీడీపీ డిమాండ్ చేస్తోంది. జైలు వైద్యులు పరీక్షించి, మందులు ఇచ్చారని జైళ్ల శాఖ స్పష్టం చేసింది. చంద్రబాబు ఆరోగ్యానికి ఎటువంటి ఇబ్బంది లేదని నిబంధనల ప్రకారం పనిచేస్తున్నామని జైలు అధికారులు స్పష్టంచేశారు.

చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై వాస్తవాలు దాచుతున్నారని టీడీపీ నేత అచ్చెన్నాయుడు ఆరోపించారు. ఎయిమ్స్ కు బాబును తరలించి, వైద్యం అందించాలని, స్టెరాయిడ్స్ ఇచ్చ బాబు ఆరోగ్యాన్ని పాడుచేస్తున్నారని అచ్చెన్న మండిపడ్డారు. మరోవైపు చంద్రబాబు కోర్టు కేసులపై నరాలు తెగే ఉత్కంఠత కొనసాగుతోంది. సుప్రీంకోర్టులో  చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌పై వాదనలు కొనసాగుతున్నాయి. 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News