Saturday, November 23, 2024
HomeతెలంగాణSidhipeta: TSPSC బోర్డును తక్షణమే ప్రక్షాళన చేయాలి

Sidhipeta: TSPSC బోర్డును తక్షణమే ప్రక్షాళన చేయాలి

సిద్దిపేటలో జాతీయ రహదారి పై రాస్తారోకో

TSPSC బోర్డును తక్షణమే ప్రక్షాళన చేయాలని డిమాండ్ చేస్తూ ‘సడక్ బంద్’ లో భాగంగా BSP, PDSU అధ్వర్యంలో బాబు జగ్జివన్ రామ్ చౌరస్తా నుండి రంగాధంపల్లి అమరవీరుల స్తూపం వరకు ర్యాలీగా వెళ్లి అనంతరం జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. దీంతో వాహనాలు భారీగా నిలిచిపోయాయి. త్రూ టౌన్ పోలీసులు అక్కడికి చేరుకొని నాయకులను అరెస్టు చేసి స్టేషన్ కు తరలించి కేసులు నమోదు చేశారు.
ఈ సందర్భంగా BSP జిల్లా అధ్యక్షుడు మోహన్ ,PDSU రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.వి.శ్రీకాంత్, ప్రజాఫ్రంట్ నాయకుడు సత్తయ్య మాట్లాడుతూ టిఎస్పీఎస్సి బోర్డ్ వెంటనే ప్రక్షాళన చేయాలనీ డిమాండ్ చేశారు. ప్రభుత్వ అసమర్థత వల్ల నిన్న రాత్రి హైదరాబాద్ చిక్కడపల్లి హాస్టల్ లో ప్రవలిక అనే నిరుద్యోగ యువతి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుందని ఆరోపించారు. ఇది ముమ్మాటికీ ప్రభుత్వం చేసిన హత్యే అని ఆరోపించారు.తెలంగాణ రాష్ట్రంలో ఎంతో మంది నిరుద్యోగులు దౌర్భాగ్యమైన స్థితికి నెట్టబడ్డారని ,అన్ని పోటీ పరీక్షలను లీక్ చేసి,వాయిదాలు వేసి నిరుద్యోగులను మానసికంగా హింసిస్తున్నారనీ మండిపడ్డారు. తక్షణమే బోర్డ్ చైర్మన్ జనార్ధన్ రెడ్డిని విధుల నుండి తొలగించిన తర్వాతనే అన్ని రకాల పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. వన్ టైమ్ రిజిష్టర్ చేసుకున్న ప్రతి నిరుద్యోగికి 3 లక్షల రూపాయల నష్టరిహారం చెల్లించాలని, అన్ని రకాల ఉద్యోగ ఖాళీలను గుర్తించి మెగా డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆత్మహత్య చేసుకున్న ప్రవలిక కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి లింగంపల్లి యాదగిరి,అసెంబ్లీ అధ్యక్షుడు పుల్లురి ఉమేష్, పీడీఎస్.యు జిల్లా ప్రధాన కార్యదర్శి విద్యానాథ్,బీఎస్పీ అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి అశోక్,నేతలు బాబు, వెంకటేశ్వర్లు,మల్లేశం ,భాను,ప్రశాంత్,మహేష్,పీడీఎస్.యు నాయకులు హిమవంత్ ,సాయి కార్తీక్, వెంకట్, లక్ష్మన్, హరి కిరణ్, వేణు, భాను, రాజు, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News