Saturday, November 23, 2024
HomeతెలంగాణBathukamma: పండగకు పెద్దన్నలా చీరలు పెట్టే సంస్కృతి మరెక్కడా లేదు

Bathukamma: పండగకు పెద్దన్నలా చీరలు పెట్టే సంస్కృతి మరెక్కడా లేదు

సూర్యాపేట అభివృద్ధికి నిదర్శనం సద్దుల చెరువు ట్యాంక్ బండ్

ఏటా బతుకమ్మ పండగకు ప్రభుత్వమే పెద్దన్నలా చీరలు పెడుతున్న సంస్కృతి తెలంగాణలో మినహా ప్రపంచంలో మరెక్కడా లేదని ఎస్ ఫౌండేషన్ చైర్మన్, సూర్యాపేట శాసనసభ్యులు, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి సతీమణి గుంటకండ్ల సునీత జగదీష్ రెడ్డి పేర్కొన్నారు.

- Advertisement -

సూర్యాపేటలోని తమ నివాసంలో ఆడపడుచులతో కలిసి సునీత జగదీశ్ రెడ్డి బతుకమ్మ వేడుకల్లో పాల్గొని బతుకమ్మ పాటలు పాడుతూ రంగు రంగుల పూలతో బతుకమ్మలను పేర్చారు.

ఈ సందర్భంగా సునీత జగదీష్ రెడ్డి మాట్లాడుతూ మహిళల ఆరాధ్య పండగ అయిన బతుకమ్మ పండుగను రాష్ట్ర పండుగగా బతుకమ్మ గుర్తింపునిచ్చింది కేసీఆరే అన్నారు.

అంతకుముందు ఎవరూ కూడా ఆ ఆలోచన చేయలేదని తెలిపారు. రాష్ట్ర మహిళల పక్షాన కెసిఆర్ కు ధన్యవాదాలు తెలిపారు. మహిళల కోసం సీఎం కేసీఆర్ తీసుకొచ్చిన అనేక సంక్షేమ పథకాలే ఆయన మహిళా పక్షపాతి అనడానికి నిదర్శనం అన్నారు.

కేసీఆర్ పాలనలోని మహిళలకు సముచిత గౌరవం లభించింది అన్నారు. సూర్యాపేట అభివృద్ధికి నిదర్శనం సద్దుల చెరువు ట్యాంక్ బండ్ అన్నారు. గత పాలకుల హయాంలో కంప చెట్లతో నిండి ఉన్న సద్దుల చెరువు ట్యాంకు బండ్ వద్ద బతుకమ్మ ఆడడానికి మహిళలు పడిన ఇబ్బందులు అన్నీ, ఇన్నీ కావన్నారు.

తొమ్మిది రోజులపాటు జరిగే బతుకమ్మ వేడుకలు ఆనందోత్సవాలతో జరుపుకోవాలన్నారు. గౌరమ్మ ఆశీస్సులు ప్రతీ ఒక్కరికీ కలగాలని సునిత జగదీష్ రెడ్డి ఆకాంక్షించారు.

వేడుకల్లో మున్సిపల్ చైర్మన్ పెరుమాల అన్నపూర్ణమ్మ, గుండూరి పావని కృపాకర్, నిమ్మల స్రవంతి శ్రీనివాస్, సల్మా మస్తాన్, విజయ నాయక్, మాధవి, దండు రేణుక, ఢిల్లీ పావని, మాలి కవిత, వాంకుడోత్ పద్మ, లక్ష్మీ మకత్లాల్, అంజమ్మ, కరుణ శ్రీ, వనజ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News