తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ పండుగకు చాలా విశిష్ఠత ఉందని , ప్రకృతి పండుగగా పిలవడం జరుగుతుందని అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డా॥వి. నరేందర్ రెడ్డి అన్నారు. ముఖ్య అతిథులుగా గంగుల రజిత కమలాకర్ ,పుష్పకుమారి , ప్రముఖ వైద్యురాలు డా॥ వి.వనజా నరేందర్ రెడ్డి తో కలిసి స్థానిక వావిలాలపల్లిలోని అల్ఫోర్స్ స్కూల్ ఆఫ్ జెన్సెక్స్ట్ మైదానంలో ఆల్ఫోర్స్ విద్య సంస్థల వారి ఆధ్వర్యంలో ఆనందోత్సవాల మధ్య వేడుకగా నిర్వహించారు. అల్ఫోర్స్ బతుకమ్మ డిలైట్-2023 కు ముఖ్య అతిధిగా హాజరై సాప్రదాయాలను అనుసరిస్తు జ్యోతి ప్రజ్వలన చేసి శ్రీ దుర్గామాత విగ్రహానికి పూజా కార్యక్రమాలను నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బతుకమ్మ తెలంగాణ గొప్పతనాన్ని సాంప్రదాయాలను విస్తరింపచేస్తుందని , ప్రకృతిని పరిరక్షించే పద్ధతులను తెలిపే మహోన్నతమైన వేడుక అని వర్ణించారు. మన దేశంలోనే కాకుండా ఇతర దేశాలలో కూడా ఆకాశమే హద్దుగా పలు సాంప్రదాయాలను పాటిస్తు అవలంబిస్తు ఆనందోత్సవాల మధ్య చాలా వేడుకగా జరుపుకోవడం బతుకమ్మ గొప్పతనాన్ని తెలుపుతుందని అన్నారు. మన రాష్ట్రం ఆవిర్భవించిన తరువాత తెలంగాణ పండుగ ప్రాముఖ్యత రెట్టింపైనదని వేడుకలను చాలా పెద్ద ఎత్తున నిర్వహించుకుంటారని తెలిపారు.
ప్రకృతిలో లభించేటువంటి వివిధ రకాల పూలతో, ఆకులతో అందంగా బతుకమ్మలను తయారు చేసి గౌరీ దేవిని ప్రతిష్టించి పల్లెతనాన్ని , పల్లెలకు పట్టణాలకు మధ్య ఉన్న వత్యాసాలను వివిధ పాటల రూపంలో పాడుతూ బతుకమ్మ విశిష్టతను పరిరక్షిస్తారని తెలిపారు. ఊరు పల్లె అంతా ఏకమై బతుకమ్మను సంతృప్తి పరుస్తారని వివిధ రకాల వనరులకు బతుకమ్మలను ఆరాధిస్తారని పురాణాల ద్వారా తెలుస్తుందని అన్నారు. ప్రతి ఒక్కరు బతుకమ్మ వేడుకలను సంభరాలుగా అత్యంత పవిత్రతో, ప్రేమతో ఆప్యాయతతో అలంకరించి అమ్మవారిని పూజించాలని అన్నారు. 8 రోజుల పాటు వివిధ రకాల ప్రసాదాలతో బతుకమ్మకు నైవేధ్యంగా సమర్పించి అప్లైశ్వర్యాలను పొందుతామని అన్నారు.
వివిధ మండపాలలో దుర్గా మాతను ప్రతిష్టించి బతుకమ్మలతో, బతుకమ్మ పాటలతో అమ్మవారిని సంతృప్తి పరచడమే కాకుండా అమ్మవారి ఆశీస్సులను పొందుతారని అన్నారు. ఎన్నో సంవత్సరాల నుండి వస్తున్న ఆచారాలను క్రమం తప్పకుండా ప్రాముఖ్యంగా, చారిత్రాత్రకంగా వేడుకలను ఎటువంటి లోటు లేకుండా చాలా ఘనంగా జరుపుకుంటున్నామని అన్నారు.
గంగుల రజిత కమలాకర్ మాట్లాడుతూ అల్ఫోర్స్ విద్యాసంస్థల్లో నరేందర్ రెడ్డి సారధ్యంలో సాంప్రదాయాలకు పెద్ద పీట వేయడం జరుగుతుందని , భక్తి శ్రద్ధలను పరిరక్షిస్తు విద్యార్థుల్లో ఉత్తేజాన్ని నింపుతూ పండుగల విశిష్టతను కాపాడుతున్నారని తెలిపారు. ఈ పండుగ ద్వారా అందరు కూడా సుఖ సంతోషాలతో చిరునవ్వు చిందిస్తు చాలా గొప్పగా కుటుంభ సభ్యులతో కాలాన్ని గడుపుతూ సన్మార్గంలో పయనించాలని కోరారు. సంస్కృతి సాంప్రదాయాలను పాటిస్తున్న నరేందర్ రెడ్డి కి ప్రత్యేక దన్యవాదాలు తెలియజేశారు. బతుకమ్మను ఇలా చాలా గొప్పగా నిర్వహించడం చాలా అభినందనీయమని అన్నారు.
పుష్పకుమారి మాట్లాడుతూ చాలా గొప్ప విద్యాసంస్థ అయిన ఆల్ఫోర్స్లో వేడుకలు చాలా గొప్పగా నిర్వహించడం ఒక ఆనవాయితి అని విద్యార్థుల్లో ఆసక్తిని పెంపొందిస్తూ కళల పరిరక్షణకై కార్యక్రమాలను ప్రత్యేకంగా నిర్వహించడం చాలా గొప్ప విషయమని విద్యార్థులు కూడా క్రమశిక్షణతో బతుకమ్మ ఉత్సవాలలో పాల్గొనడం చాలా ఆదర్శమని అన్నారు. విద్యార్థుల్లో కళల పట్ల ప్రత్యేక శ్రద్ధను పెంపొదింస్తూన్న నరేందర్ రెడ్డి ని ప్రత్యేకంగా అభినందిస్తూన్నాని కొనియాడారు.
కోలమ్మ కోల్ బతుకమ్మ కోల్ వచ్చిందమ్మ బతుకమ్మ వరాలిచిందమ్మ మా బతుకమ్మ, రామరామ ఉయాల్లో పలు పాటల మీద ఆడిన బతుకమ్మ చాలా ఉత్సాహాన్ని నింపాయి. సుమారు 500 బతుకమ్మలతో ప్రాంగణానికి పండుగ శోభను తెచ్చారు. చాంద్రయాన్ బతుకమ్మ, గుజరాతీ బతుకమ్మ, నవదుర్గా బతుకమ్మలు ప్రత్యేక ఆకర్శంగా నిలిచాయి. అతిధులకు సాంప్రదాయ రీతిలో వాయనాలను అందజేసారు. ఈ కార్యక్రమంలో వివిధ కళాశాలల, పాఠశాలల ప్రిన్సిపాల్స్ , అధ్యాపకులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.