Friday, September 20, 2024
HomeఆటHaris Rauf : మోడ‌ల్‌ను పెళ్లాడిన క్రికెట‌ర్‌

Haris Rauf : మోడ‌ల్‌ను పెళ్లాడిన క్రికెట‌ర్‌

Haris Rauf : పాకిస్థాన్ పేస‌ర్ హరీస్ రవూఫ్ ఓ ఇంటివాడు అయ్యాడు. మోడ‌ల్ ముజ్నా మ‌సూద్ మాలిక్ ను పెళ్లి చేసుకున్నాడు. ఇస్లామాబాద్‌లో శ‌నివారం వీరి వివాహాం జ‌రిగింది. బంధువులు, స్నేహితుల స‌మ‌క్షంలో వీరిద్ద‌రు ఒక్క‌టి అయ్యారు. ఈ వేడుకకు సహచర పేసర్ షాహీన్ షా అఫ్రిది, మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది, లాహోర్ ఖలందర్‌కు చెందిన సమీన్ రాణా, అతిఫ్ రానా, అకిబ్ జావేద్ లు హాజ‌ర‌య్యారు.

- Advertisement -

పెళ్లి సందర్భంగా హరీస్ తెల్లటి షేర్వానీలో మెరిసిపోగా ముజ్నా మ‌సూద్ మాలిక్ బంగారు రంగు ఎంబ్రాయిడరీతో కూడిన వైట్‌ లెహంగాలో మురిసిపోయింది. కాగా.. వీరిద్ద‌రు క‌లిసి చ‌దువుతున్నారు. కొన్నేళ్లుగా ప్రేమించుకున్న ఈ జంట పెళ్లితో త‌మ బంధాన్ని మ‌రో మెట్టు ఎక్కించారు. ప్ర‌స్తుతం వీరి పెళ్లి ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. కొత్త జంట‌కు ప‌లువురు ఆట‌గాళ్ల‌తో పాటు నెటీజ‌న్లు శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు.

ఇదిలా ఉంటే.. హారీస్ ర‌వూష్ ఇటీవ‌ల ఇంగ్లాండ్‌తో జ‌రిగిన టెస్టు సిరీస్‌లో సుదీర్ఘ‌పార్మ‌ట్‌లో అరంగ్రేటం చేశాడు. అయితే తొలి టెస్టులో ఫీల్డింగ్ చేస్తూ గాయ‌ప‌డ్డాడు. దీంతో మ్యాచ్‌తో పాటు టెస్ట్ సిరీస్ మొత్తానికి దూరం అయ్యాడు. ఆస్ట్రేలియా వేదిక‌గా జ‌రిగిన టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో పాకిస్థాన్ ఫైన‌ల్ చేరుకోవ‌డంతో ర‌వూఫ్ కీల‌క పాత్ర పోషించాడు. ఫైన‌ల్లో కూడా 23 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశాడు. మొత్తం ఇప్ప‌టి వ‌ర‌కు ర‌వూఫ్‌కు పాక్ త‌రుపున 57 టీ20లు, 15 వ‌న్డేలు, ఒక టెస్ట్ మ్యాచ్ ఆడాడు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News