Friday, April 11, 2025
Homeఆంధ్రప్రదేశ్Banaganapalli: రామ సుబ్బారెడ్డికి కాటసాని పరామర్శ

Banaganapalli: రామ సుబ్బారెడ్డికి కాటసాని పరామర్శ

బైక్ నుంచి పడి గాయాలు

బనగానపల్లె మండలం ఎర్రగుడి గ్రామ వైఎస్ఆర్ పార్టీ నాయకుడు రామ సుబ్బారెడ్డి మోటార్ బైక్ ప్రమాదంలో తీవ్ర గాయాలు అయి చికిత్స పొందుతున్నారు. రామ సుబ్బారెడ్డికి బైక్ ప్రమాదం జరిగిందన్న విషయం తెలుసుకున్న అవుకు మండల వైఎస్ఆర్ పార్టీ నాయకులు చల్లా సూర్య ప్రకాశ్ రెడ్డి బనగానపల్లె పట్టణంలోని ఎర్రగుడి రామసుబ్బారెడ్డి స్వగృహానికి వెళ్లి ఆయనను, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో అవుకు మండల వైఎస్ఆర్ పార్టీ కన్వీనర్ కాటసాని తిరుపాల్ రెడ్డి, బండి బ్రహ్మానందరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చల్లా సూర్య ప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ ఎర్రగుడి గ్రామసుబ్బారెడ్డి తమ కుటుంబానికి ఎంతో అత్యంత ఆప్తుడని అతనికి బైకు ప్రమాదం జరగడం చాలా బాధాకరమైన సంఘటనని ఆ కుటుంబానికి చల్లా కుటుంబం అండదండలు ఎల్లప్పుడూ ఉంటాయని చెప్పారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News