Friday, September 20, 2024
HomeతెలంగాణBichkunda: ఎన్నికల మేనిఫెస్టో వివరించిన హన్మంత్ షిండే

Bichkunda: ఎన్నికల మేనిఫెస్టో వివరించిన హన్మంత్ షిండే

పేద ప్రజల మేలు కోసమే ..

కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రం లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో సోమవారం రోజున జుక్కల్ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి హన్మంత్ షిండే ఎన్నికల మేనిఫెస్టో ని విడుదల చేశారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసిఆర్ ప్రవేశ పెట్టిన నూతన ఎన్నికల మ్యానిఫెస్టోలోని పథకాలను వివరించారు.
సామాన్యుడి కోసమే కెసిఆర్ సంకల్పం తో మానిఫెస్టో ను ప్రవేశ పెట్టారని చెప్పారు. దేశంలో ఎక్కడ లేని విధంగా మన ప్రభుత్వం ఎన్నో పథకాలను ప్రవేశ పెట్టి, పేద ప్రజల మేలు కోసమే ఈ బిఆర్ఎస్ ప్రభుత్వం అని అన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News