Saturday, November 23, 2024
HomeతెలంగాణManchiryala: అభివృద్ధి, సంక్షేమ పథకాలను సమగ్రంగా పరిశీలించి అధ్యయనం చేయాలి

Manchiryala: అభివృద్ధి, సంక్షేమ పథకాలను సమగ్రంగా పరిశీలించి అధ్యయనం చేయాలి

జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలపై సమగ్రంగా పరిశీలించి అధ్యయనం చేయాలని జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. జిల్లాలోని నస్పూర్లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) సబావత్ మోతిలాల్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి బి.శేషాద్రి, జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్రావు, జిల్లా సంక్షేమాధికారి కె.చిన్నయ్య, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి నరేందర్, జిల్లా వ్యవసాయ అధికారి కల్పనలతో కలిసి సెంట్రల్ సెక్రటేరియట్ సర్వీస్ నుండి అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్స్ ప్రొబేషనర్స్ (ఎ.ఎస్.ఓ.)లు శిక్షణా కార్యక్రమం కోసం (ఎఫ్.టి.పి.)లో భాగంగా మన జిల్లాకు వచ్చిన బృంద ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.

- Advertisement -

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… జిల్లాలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలచే అమలు చేయబడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను సమగ్రంగా పరిశీలించి అధ్యయనం చేయాలని తెలిపారు. జిల్లాలోని లక్షెట్టిపేట మండలంలోని గుల్లకోట, హాజీపూర్ మండలంలోని దొనబండ, తాండూర్ మండలంలోని మాదారం, బెల్లంపల్లి మండలంలోని పాతబెల్లంపల్లి, భీమిని మండలంలోని బిట్టూర్పల్లి గ్రామ పంచాయతీలలో కొనసాగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను పరిశీలించాలని, గ్రామీణ జీవితంలోని సామాజిక ఆర్థిక అంశాలు, నిర్ధిష్ట లక్ష్యాలు తెలుసుకోవాలని, అనుభవపూర్వక అభ్యాసానికి ఇది మంచి అవకాశమని తెలిపారు. ఒక గ్రామంలో ఉన్న సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితుల ప్రగతి గతిశీలతను అధ్యయనం చేయాలని, గ్రామీణ ప్రజలు, ముఖ్యంగా బి.పి.ఎల్. కుటుంబాలు, భూమి లేని కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు, ఇబ్బందులను తెలుసుకోవడం, సామాజిక, ఆర్థిక, రాజకీయ కార్యకలాపాలలో మహిళల భాగస్వామ్య స్థాయిని తెలుసుకోవడం, జీవన నాణ్యత, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల ప్రభావం పరంగా గ్రామంలో సంభవించిన మార్పులను అధ్యయనం చేయడం అవసరమని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను పూర్తి స్థాయిలో పరిశీలించాలని తెలిపారు. శిక్షణ కొరకు వచ్చిన బృందానికి గ్రామాలలో ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.

ల్యాండ్ రెవెన్యూ సంబంధించిన అంశాలు, మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం పరిధిలో జరుగుతున్న కార్యక్రమాలను పరిశీలించాలని తెలిపారు. గ్రామాల వారిగా అన్ని సదుపాయాలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి, మంచిర్యాల డి.ఎల్.పి.ఓ.లు, ఫణింధర్ రావు, ప్రభాకర్ రావు, మండల పరిషత్ అభివృద్ధి అధికారి అబ్దుల్ హై, మండల పంచాయతీ అధికారులు, సబ్దల్ అలీ, వేదాల శ్రీనివాస్, శ్రీనివాస్ రెడ్డి, సత్యనారాయణ, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News