గడప గజపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి పాల్గొన్నారు. సొంత మండలం కావడంతో ప్రతి ఇంటికి వెళ్లి అన్నా, వదిన, మామా అని పలకరిస్తూ.. ప్రభుత్వ అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ అలాగే సమస్యలను తెలుసుకుంటూ సమస్యలను పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు జారీచేశారు.
అవుకు పట్టణంలో చెన్నకేశవ స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు కాటసాని. బనగానపల్లె నియోజకవర్గ శాసనసభ్యులు కాటసాని రామిరెడ్డి, ఎంపీపీ చల్లా రాజశేఖర్ రెడ్డి, చల్లా సూర్య ప్రకాష్ రెడ్డి, చల్లా విఘ్నేశ్వర రెడ్డి, కాటసాని ఓబుల్ రెడ్డి
అవుకు పట్టణం ఒకటవ గ్రామ సచివాలయ పరిధిలో బనగానపల్లె నియోజకవర్గం శాసనసభ్యులు కాటసాని రామిరెడ్డి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ముందుగా చల్లా రామకృష్ణారెడ్డి స్వగృహానికి వెళ్లి, చల్లా చిత్రపటానికి పూలమాలలు సమర్పించి, నివాళులు అర్పించారు. అనంతరం చల్లా సోదరులతో కలిసి చెన్నకేశవ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం గడప గడపకు కార్యక్రమం అధికారులు నాయకులతో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా బనగానపల్లె నియోజకవర్గ శాసనసభ్యులు కాటసాని రామిరెడ్డి మాట్లాడుతూ .. జగనన్న ప్రభుత్వం అధికారం చేపట్టి నాలుగున్నర సంవత్సరకాలంలో చెప్పిన ప్రతి హామీని ప్రజలకు అందించారన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడమే కాకుండా అభివృద్ధి వైపు కూడా అడుగులు వేసి, గ్రామాల్లో గ్రామ సచివాలయం భవనాలు, రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ హెల్త్ క్లినిక్ లాంటి ఎన్నో శాశ్వత గృహ నిర్మాణాలు నిర్మించామన్నారు. కరోనా కష్టకాలంలో కూడా ఇచ్చిన హామీలు నెరవేర్చిన ఏకైక ముఖ్యమంత్రి దేశంలో మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డని ఈ సందర్భంగా తెలిపారు.
రాబోయే 2024 ఎన్నికల్లో అఖండ మెజార్టీతో తనను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించి మళ్లీ వైఎస్ఆర్ పార్టీకి అధికారం ఇవ్వాలని ప్రజలను కోరారు.
ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ నాయకులు చల్లా సూర్యప్రకాశ్ రెడ్డి, ఎంపీపీ చల్లా రాజశేఖర్ రెడ్డి, పట్టణ సర్పంచ్ మందా గురమ్మ, పట్టణ ఉపసర్పంచ్ చల్లా రఘునాథరెడ్డి ,మాజీ సర్పంచ్ దుగ్గిరెడ్డీరవీంద్రనాథ్ రెడ్డి, పోతిరెడ్డి శ్రీనివాసరెడ్డి, నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి జయ చంద్రా రెడ్డి, అవుకు రాజవంశీయులు నంద్యాల రామకృష్ణమరాజు, నంద్యాల త్రివిక్రమ వర్మ, ఉమ్మడి జిల్లాల ఎంపిటిసిల సంఘం అధ్యక్షుడు గోపవరం గోపాల్ రెడ్డి, మండల గ్రామ సచివాలయ కన్వీనర్ తల్లం సుబ్రహ్మణ్యం, అవుకు పట్టణ బలిజ సంఘం అధ్యక్షుడు రామన్న బత్తిన మద్దిలేటి గౌడ్, వాయునంద గౌడ్, వెంకటేశ్వర్లు గౌడ్, మామిల్ల సుబ్బన్న,తోట నరేష్,గాజుల క్రిష్ణ కుమార్, వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మండల అధికారులు గ్రామ సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, గృహసారథులు తదితరులు పాల్గొన్నారు.