Friday, November 22, 2024
Homeహెల్త్Ever young: యవ్వనంగా ఆకర్షణీయంగా..

Ever young: యవ్వనంగా ఆకర్షణీయంగా..

చర్మాన్ని జాగ్రత్తగా సంరక్షించుకుంటే యవ్వనంగా కనిపించవచ్చు

వయసును దాచే టిప్స్

- Advertisement -

అందంగా కనిపించడం ఒక ఎత్తయితే, యంగ్ గా మెరవడం మరొక ఎత్తు. నిత్యం చర్మసంరక్షణ పాటించితే ఇవి రెండూ సాధ్యమే. అయితే మీ వయసు కన్నా పది సంవత్సరాలు యంగ్ గా కనిపించడమనేది సవాలుతో కూడిన విషయం. దీని నివారణకు చర్మం పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా చాలా ఉన్నాయి.

వయసు పెరిగే కొద్దీ చర్మంలో ఎన్నో మార్పులు పొడసూపుతాయి. వయసు వల్ల వచ్చే మార్పుల నుంచి శరీరాన్ని సంరక్షించుకోవాలంటే ముఖానికి నిత్యం యాంటిఏజింగ్ క్రీము తప్పకుండా రాసుకోవాలి. ఈ క్రీమును రాత్రి నిద్రపోయేముందు గాని లేదా పగటి సమయంలో గాని రాసుకోవచ్చు. అలొవిరా జెల్ ఉన్న మంచి బ్రాండెడ్ యాంటి ఏజింగ్ క్రీము వాడితే ఫలితాలు బాగా ఉంటాయని చర్మనిపుణులు చెపుతున్నారు. అలాగే మీ చర్మం యంగ్ గా కనిపించాలంటే చర్మం హైడ్రేటెడ్ కావాలి. ఇందుకు గాను నిద్రపోయేటప్పుడు ఒక షీట్ మాస్కును ముఖానికి పెట్టుకోవాలి.

ఫేషియల్ చర్మం కాంతివంతంగా ఉండాలంటే ఫేస్ సిరమ్, ఉపయోగించాలి. ముఖం, మెడ భాగాలలో షీట్ మాస్కుతో ఫేస్ సిరమ్ ను అప్లై చేసుకోవచ్చు. అలాగే క్రమం తప్పకుండా నార్మల్ స్కిన్ రొటీన్ ను తప్పకుండా అనుసరించాలి. దీనివల్ల చర్మం ఎంతో యంగ్ గా కాంతులీనుతుంది. నార్మల్ స్కిన్ కేర్ రొటీన్ ను రోజుకు మూడునాలుగుసార్లు చేసుకోవాలి. ఇందుకు మీరు సిటిఎం రొటీన్ ను తప్పనిసరిగా అనుసరించాలి. అంటే క్లీన్సర్, టోనర్, ముఖంపై మాయిశ్చరైజర్ మూడింటినీ తప్పకుండా ఫాలో అవాలి. ముఖంపై తప్పనిసరిగా సన్ స్క్రీన్ రాసుకోవాలి. చర్మానికి హైడ్రేషన్ తరచూ అందివ్వడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. కొత్త ప్రాడక్టులను వాడాలనుకున్నప్పుడు ముందొస్తుగా చర్మనిపుణులను సంప్రదిస్తే ఎంతో మంచిది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News