Thursday, October 3, 2024
HomeతెలంగాణJivan Reddy: జీవితాంతం మీకోసం జీతగాడిలా పని చేస్తా

Jivan Reddy: జీవితాంతం మీకోసం జీతగాడిలా పని చేస్తా

'నమస్తే నవనాథపురం' కార్యక్రమంలో జీవన్ రెడ్డి

అధికారం ముసుగులో ప్రజాధనాన్ని కొల్లగొట్టే కాంగ్రెస్ సిద్ధాంతం అవినీతి. మతం పేరుతో ప్రజల చిచ్చు పెడుతున్న బీజేపీ సిద్ధాంతం దుర్నీతి అని ఆర్మూర్ నియోజకవర్గ బీఆర్ ఎస్ అభ్యర్థి, ఆపార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి మండిపడ్డారు
ఈ రెండు పార్టీలకు ఓటేస్తే మళ్లీ తెలంగాణ అధోగతి పాలు కావడం తధ్యం. కాంగ్రెస్ బలం కర్ణాటక నుంచి వస్తున్న నోట్లు.
బీఆర్ఎస్ బలం తెలంగాణ ఓట్లు అని ఆయన వ్యాఖ్యానించారు. నమస్తే నవనాథ పురం కార్యక్రమంలో భాగంగా బుధవారం మాక్లూర్ మండలంలోని చిక్లి గ్రామంలో “ప్రజాశీర్వాద యాత్ర” నిర్వహించారు. ఆయన చిక్లి గ్రామంలో ఇంటింటికీ తిరిగి మళ్లీ బీఆర్ఎస్ ను గెలిపించాలని, తనను మరోసారి దీవించాలని కోరుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అంతకుముందు బీఆర్ఎస్ నేతలతో కలిసి గ్రామంలోకి అడుగు పెట్టిన జీవన్ రెడ్డికి ప్రజలు డప్పు వాయిద్యాలు, మేళతాళాలతో ఘన స్వాగతం పలికారు. మహిళలు బోనాలతో తమ అభిమాన నేతకు బ్రహ్మ రథం పట్టారు. వందలాదిమంది యువకులు పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించి జీవన్ రెడ్డిని ఆప్యాయంగా స్వాగతించారు. ఈ సందర్భంగా పూలమాలలు, శాలువాలతో గ్రామస్తులు, పలు కుల సంఘాలు, ప్రజా సంఘాల పెద్దలు జీవన్ రెడ్డిని సత్కరించారు.

- Advertisement -


“జై జీవనన్న, జైజై కేసీఆర్, జై తెలంగాణ”, ఆర్మూర్ గడ్డ జీవనన్న అడ్డా” అన్న నినాదాలతో చిక్లి గ్రామం మారుమోగింది. ఆయన ప్రతీ ఒక్కరినీ పేరుపేరునా పలకరిస్తూ ప్రజల యోగ క్షేమాలను అడిగి తెలుసు కున్నారు. పలు సమస్యలను ఆయన అక్కడికక్కడే పరిష్కరించారు. అనంతరం జరిగిన సభలో జీవన్ రెడ్డి మాట్లాడుతూ తాను ఈ పదేండ్లలో మీ గ్రామాల అభివృద్ధికి ఏ చేశానో చెప్పదానికి మీవద్దకు వచ్చానన్నారు. నేను చిక్లి గ్రామానికి వచ్చే సమయంలో మీ గ్రామానికి చెందిన కొంపల్లి కౌసల్య, గడ్డం ప్రానాయి, ఎల్లగొండి రమేష్, హుస్సేన్ బి, లావణ్య, మాక్లూరు నారాయణ, సందీప్, మంగలి హనుమంత్, భోజన్న, మమత తదితర 30 మంది వికలాంగులు నన్ను కలిసి మొన్ననే మా పెన్షన్లను రూ.4016కు పెంచి మళ్లీ అధికారంలోకి రాగానే రూ.6016కు పెంచుతామని మాటిచ్చిన కేసీఆర్ సారు నిజంగా దేవుడు. ఆయన ప్రభుత్వం పదికాలాలు చల్లగా ఉండాలి. ఆర్మూరు నియోజకవర్గంలో మేం 6వేలమంది వికలాంగులం ఉన్నాం. మేమే ఇంటింటికీ తిరిగి ఒక్కొక్కలం 15 ఓట్ల చొప్పున వేయించి మిమ్మల్ని70వేల ఓట్ల మెజారిటీతో గెలిపించుకుంటామని చెప్పిన్రు. అయినా నేను పోయి చేసిన ప్రగతితో పాటు బీఆర్ఎస్ మూడోసారి అధికారంలోకి రాగానే అమలు చేసే కొత్త పథకాల గురించి మా అక్కలు చెల్లెళ్లకు, మా అన్నలకు, తమ్ముళ్లకు చెప్పి వారి కడుపులో తలపెట్టు దీవించండి అని అడగడానికి మీ దగ్గరకొచ్చా అని జీవన్ రెడ్డి చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి రాగానే వృద్ధులు, ఒంటరి మహిళలు, వితంతువులు, కల్లు గీత, బీడీ కార్మికుల పెన్షన్లను రూ.5వేలకు, వికలాంగుల పెన్షన్లు రూ.6వేలకు, ఇప్పుడు ఏడాదికి ఎకరానికి రూ.10వేల చొప్పున ఇస్తున్న రైతు బంధు నిధులు రూ.16 వేలకు పెరుగుతాయి. సౌభాగ్యలక్ష్మి పథకం ద్వారా అర్హులైన మహిళలకు నెలకు రూ.3వేల చొప్పున జీవన భృతి వస్తుంది. రూ.4వందలకే వంట గ్యాస్ సిలిండర్ సరఫరా జరుగుతుంది. 93 లక్షల కుటుంబాలకు రూ.5 లక్షల జీవిత బీమా సౌకర్యం అమలులోకి రానుంది. ఇంకా ఎన్నో పేదలకు మేలు చేసే పథకాలతో విడుదలైన బీఆర్ఎస్ మేనిఫెస్టో సకల జనులకు ఒక వరం అని జీవన్ రెడ్డి పేర్కొన్నారు. ఇక ఇప్పటి వరకూ చేసిన పనులను చూస్తే
చిక్లి గ్రామంలో 407 మంది లబ్దిదారులకు నెలకు రూ.2016,రూ. 4016 చొప్పున ఇప్పటివరకు రూ.5.28 కోట్లు పెన్షన్ల రూపంలో వచ్చాయి.


ఈ గ్రామానికి చెందిన 643 మంది రైతులకు రైతుబంధు పథకం ద్వారా ఇప్పటివరకు రూ.61.23 లక్షలు వారి బ్యాంకు ఖాతాలో జమయ్యాయి. ఈ గ్రామంలో వివిధ కారణాల వల్ల మృతి చెందిన 11 మంది రైతుల కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున రూ.55 లక్షల రైతు బీమా పరిహారం అందింది. ఈ గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న 67 మందికి మెరుగైన వైద్యం కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా రూ.19.82 లక్షల ఆర్థిక సాయం అందించాం. కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా 59 మంది పేదింటి ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేయటానికి రూ.57.82 లక్షలు, షాదీ ముబారక్ పథకం ద్వారా ఆరుగురు ఆడపిల్లల పెళ్లిళ్లు చేయడానికి రూ.5.75 లక్షలు మంజూరు చేసాం. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి తాగునీరు సరఫరా చేస్తున్నాం. మిషన్ కాకతీయ ద్వారా పెద్ద చెరువు, చింతలచెరువు, ఎర్రకుంట మరమ్మతులకు రూ.85.78 లక్షలు ఖర్చు చేశాం. ఈ గ్రామంలోని 36 మహిళా గ్రూపులకు రూ.10.5 లక్షల వడ్డీ లేని రుణాన్ని అందించాం. ఈ గ్రామానికి చెందిన 37 మంది లబ్ధిదారులకు రూ.46.25 లక్షలతో గొర్రెల యూనిట్లు పంపిణీ చేశాం. విద్యుత్ శాఖ మరమ్మతుల కోసం మూడు లక్షలు ఇచ్చాం. ఉచిత ప్రసవాలు జరిగిన 45 మంది ఈ గ్రామ మహిళలకు కేసీఆర్ కిట్లు పంపిణీ చేశాం. ఈ గ్రామానికి చెందిన 755మందికి ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించాం. గ్రామపంచాయతీ భవనానికి రూ.16 లక్షలు, మన ఊరు- మనబడి పథకం ద్వారా పాఠశాలల మరమ్మతులకు రూ.16.50 లక్షలు, అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణం కోసం రూ.36. 03 లక్షలు, కలవర్టు నిర్మాణానికి రూ 1.06 లక్షలు, ఎస్సీ కాలనీ వద్ద ఆరు కొత్త స్తంభాలు, వాటికి సంబంధించిన పరికరాల కొనుగోళ్లకు 93వేలు, ట్రాక్టర్, ట్రాలీ, ట్యాంకర్ కొనుగోలుకు రూ.9 లక్షలు, డంపింగ్ యార్డ్ నిర్మాణం రూ.2.5 లక్షలు, వైకుంఠధామం నిర్మాణానికి రూ.10 లక్షలు, నర్సరీ నిర్మాణానికి రూ.6లక్షలు, పల్లె ప్రకృతి వన నిర్మాణానికి రెండున్నర లక్షలు, మినీ బృహత్ పల్లె ప్రకృతి వనానికి రూ.2.70 లక్షలు, తెలంగాణ క్రీడా ప్రాంగణానికి 30వేల రూపాయలను మంజూరు చేశాం. ఈ గ్రామంలోని అన్ని కుల సంఘాలకు సమాన గౌరవాన్ని ఇచ్చాం. మున్నూరు కాపు సంఘానికి రూ.10 లక్షలు, రజక సంఘానికి ఐదు లక్షలు, మాదిగ సంఘం ప్రహరీ గోడకు నాలుగు లక్షలు, మహిళా భవనానికి ఐదు లక్షలు, రెడ్డిక సంఘానికి ఐదు లక్షలు, కురుమ సంఘానికి ఎనిమిది లక్షలు, ఈద్గా ప్రహరీ గోడకు రూ.5లక్షలు, మైనార్టీ కమ్యూనిటీ హాలుకు ఐదు లక్షలు, యూత్ యూత్ బిల్లింగ్ కు రూ.8లక్షలు దళితవాడ భవనానికి రూ.5లక్షలు, ఎస్సీ మాదిగ సంఘానికి రూ.5లక్షలు, దళిత మహిళా భవనానికి రూ.5లక్షలు మంజూరు చేసాం. ఈ గ్రామ పంచాయతీకి ఇప్పటివరకు రూ. 84.85 లక్షల అభివృద్ధి నిధులు వచ్చాయి అని జీవన్ రెడ్డి చిక్లి గ్రామ ప్రగతి నివేదికను ప్రజలకు విన్నవించారు. “సకలజనుల గుండెల నిండా గులాబీజెండా కొలువై ఉంది. ఈ ఎన్నికల్లోనూ జెట్ స్పీడ్ తో “కారు”దూసుకెళ్లుతుంది.
హ్యాట్రిక్ విజయంతో బీఆర్ఎస్ సరికొత్త చరిత్ర సృష్టించడం ఖాయం.


అభివృద్ధి, సంక్షేమం కేసీఆర్ కు రెండు కళ్ళు. కేసీఆర్ దార్శనికత వల్లే ఆర్మూర్ నియోజకవర్గానికి మహర్దశ పట్టింది. అభివృద్ధి, సంక్షేమంతో ప్రతీ ఊరిలో ప్రగతి, ప్రతీ ఇంటిలో పురోగతి కనిపిస్తోంది. సబ్బండ వర్గాలూ కారు,సారు, కేసీఆర్ వెంటే కదం తొక్కుతున్నాయి. ఆర్మూర్ నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రజల సంక్షేమం కోసం ఎండనక,వాననక శ్రమిస్తున్నా. నన్ను మళ్లీ ఆశీర్వదించండి. జీవితాంతం మీకోసం జీతగాడిలా పని చేస్తా” అని జీవన్ రెడ్డి పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News