Friday, November 22, 2024
Homeఆంధ్రప్రదేశ్Allagadda: టిడ్కో గృహాలు పంపిణీ చేసిన మంత్రులు

Allagadda: టిడ్కో గృహాలు పంపిణీ చేసిన మంత్రులు

ఆళ్లగడ్డ అన్ని విధాల అభివృద్ధి చేశాం ఎమ్మెల్యే గంగుల

తమకంటూ ఒకపక్క ఇల్లు ఉండాలనేదే ప్రతి పేదింటి అక్క చెల్లెమ్మల చిరకాల స్వప్నమని వారి తోబుట్టుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దీన్ని సాకారం చేస్తూ నవరత్నాల్లో పేదలందరికీ ఇళ్లు పథకం కింద మహిళల పేరిట ఏకంగా ఇల్లు నిర్మించి ఆ ఇంటిని ఆ ఇంటి గృహిణి పేరిట రిజిస్ట్రేషన్ చేసినేడు పంపిణీ చేయడం దసరా కంటే గొప్ప పండగ టిడ్కో గృహాలబ్ధిదారులకు ముందే వచ్చిందని పట్టణాభివృద్ధి మంత్రి ఆది మూలపు సురేష్ ,ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర నాధ్ రెడ్డి ,ఉప ముఖ్యమంత్రి అంజాద్ భాష, ఎమ్మెల్యే గంగుల బిజేంద్రా రెడ్డిలు పేర్కొన్నారు. బుధవారం పట్టణంలో చింతకుంట్ల సమీపంలో జాతీయ రహదారి పక్కన నూతనంగా నిర్మించిన 1392టిడ్కో గృహాలను పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి అంజాద్ భాష ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డి రాష్ట్ర జల వనరుల శాఖ సలహాదారులు గంగుల ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి జిల్లా కలెక్టర్ మన జీర్ జిలాని సామూన్ కలసి ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ చేసిన కార్యక్రమంలో లబ్ధిదారులను ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ పండుగ వాతావరణంలో సామూహిక గృహప్రవేశాలకు పేదలు సిద్ధమయ్యారని సామూహిక గృహప్రవేశాలు కార్యక్రమంలో లబ్ధిదారులకు గృహాలు అందజేయడం గొప్ప పరిణామం ఆయన అన్నారు. అనంతరం ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి మాట్లాడుతూ ఈ రోజు ఒక పెద్ద పండగలగా జరుగుతుందని ప్రతి ఒక్కరి కూడా సొంత ఇల్లు తయారు చేసుకోవడం కొద్దిమంది జీవితమంతా కష్టపడిన సొంత ఇల్లు తయారు చేసుకునే పరిస్థితి ఉండదని అలాంటిదే ఈరోజు నేను ఆళ్లగడ్డ ఎమ్మెల్యే గా ఉండడంతో 1392 మంది లబ్ధిదారులకు గృహాలు నిర్మించడం అలాగే గ్రామీణ ప్రాంతంలో మూడు వేల ఇళ్ల పట్టాలు పంపిణీ చేయడం జరిగిందని తాను అదృష్టంగా భావిస్తున్నానని 13 92 ఇల్లు ఇవ్వడం వీటన్నిటికీ మౌలిక సదుపాయాలు భాగంగా డ్రైనేజీ విద్యుత్తు త్రాగునీరు సిసి రోడ్లు ప్రతిదీ పూర్తిచేసి ఆళ్లగడ్డలోని టిడ్కో ఇల్లు ఒక స్థాయిలో ఉండే విధంగా ఏర్పాటు చేసి ఇస్తున్నామని ఎమ్మెల్యే గంగుల అన్నారు.

- Advertisement -

ప్రతి ఇంట్లో కుళాయి టాప్ తిప్పితే మినరల్ వాటర్ కు సమానంగా నీరు వస్తుందని గతంలో ఏ ప్రభుత్వాలు చేయలేదని రానున్న ఆరు నెలలలో ఎన్నికలు ఉన్నాయని పగటివేషగాళ్ళు బయలుదేరుతున్నారని వాళ్ళు అబద్ధాలు చెబుతూ ఉంటారన్నారు గతంలో గృహాలు మేమే నిర్మించామని వాటికి ఈ ప్రభుత్వం రంగులు వేసి ప్రారంభిస్తున్నారని చెబుతుంటారన్నారు వాళ్లు అబద్ధాలు చెబుతూ పబ్బం గడుపుతారు అన్నారు 2019 ఎన్నికల్లో ఆరు నెలల ముందర టెంకాయలు కొట్టారని ఆరోజు ఎన్నికల అయ్యేసరికి రెండు నుంచి మూడు కోట్ల పనులు మాత్రమే పూర్తి చేశారని కేవలం రెండు టవర్లు మాత్రమే చేశారన్నారు ఈ నాలుగున్నర సంవత్సరకాలంలో తాము మన ప్రభుత్వంలో 29 టవర్లు పూర్తి చేసి మొత్తం అన్ని బిల్డింగులు 1392 గృహాలు పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేయడం జరిగిందన్నారు నాడు అక్క చెల్లెమ్మలకు1.50 రూపాయల కేంద్రం సబ్సిడీస్తుందని రాష్ట్ర ప్రభుత్వం1.50 సబ్సిడీస్తుందని మూడు లక్షల రూపాయలు సబ్సిడీ ఇస్తారని ఒక అపార్ట్మెంట్ కట్టడానికి 6.50 లక్షల రూపాయలు ఇల్లు కట్టడానికి అయ్యే ఖర్చు అలాగే మౌలిక సదుపాయాలు కల్పించడానికి లక్ష రూపాయలు రిజిస్ట్రేషన్ ఖర్చులు 75 వేల రూపాయలు ఇలా ప్రతి ఇంటికి వెళ్లాల్సి ఉంటుంది 3 లక్షల రూపాయలు సబ్సిడీ ఇస్తాము 3 లక్షల రూపాయలు లబ్ధిదారులు పేరుమీద అప్పు రాసుకుంటాము ఆ అప్పును 20 సంవత్సరాలు అలా నెలకు 3000 రూపాయలు లబ్ధిదారులు చెల్లించాలని ఆనాడు టిడిపి ప్రభుత్వం టిడ్కో ఇల్లు ఇవ్వడానికి సిద్ధపడిందన్నారు.

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతి పేదవాడికి సొంత ఇంటి కల నెరవేర్చాలని లక్ష్యంతో రూపాయి చెల్లిస్తే చాలు పూర్తిగా ప్రభుత్వం మొత్తం చెల్లించి ప్రతి లబ్ధిదారుడికి ఇల్లును 9 లక్షల విలువ చేసే ప్రతి అపార్ట్మెంట్ ను అందించామన్నారు టిట్కో ఇళ్లకు 83 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు అలాగే ఆళ్లగడ్డలో ప్రతి ఇంటికి త్రాగునీరు అందించాలని లక్ష్యంతో 11 కోట్ల రూపాయలతో ట్యాంకులు నిర్మిస్తున్నామన్నారు ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి సంక్షేమం లేదు అంటున్నారు సంక్షేమ మాత్రమే ఉందని అంటున్నారు ముఖ్యమంత్రి విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెడుతున్నారని ప్రజలకు ఎక్కడ కూడా అభివృద్ధి లేదంటున్నారు ఆళ్లగడ్డ మునిసిపాట్లు చూసుకుంటే నాలుగున్నర సంవత్సరాల కాలంలో 140 కోట్లతో సంక్షేమ పథకాలు 0 వడ్డీ అమ్మ ఒడి తదితర పథకాలు కేవలం ఆళ్లగడ్డ మున్సిపాలిటీ అందజేశామన్నారు ఆళ్లగడ్డ పట్టణంలో అభివృద్ధి చూసుకుంటే టిట్కో ఇల్లే కాకుండా నీళ్ల ట్యాంకులే కాకుండా నాడు నేడు మనబడి ఇలా మూడు కోట్ల రూపాయలతో పట్టణంలోని మున్సిపాలిటీ స్కూల్ అన్ని మరమ్మతులు చేయించామన్నారు కొత్తగా కోటిన్నర రూపాయలతో ఇండోర్ స్టేడియం పనులు పూర్తి చేసి డిసెంబర్ నాటికి పట్టణ ప్రజలకు ఇస్తామన్నారు ఇన్ని రోజులు ఆళ్లగడ్డను పంపించిన వాళ్లు ఇది మాకోట అని చెప్పుకునే వాళ్ళు పట్టణానికి ఒక డిగ్రీ కాలేజీ తేలేకపోయారని ఆయన ఎద్దేవా చేశారు ఆళ్లగడ్డ పట్టణానికి డిగ్రీ కాలేజ్ తెచ్చిన ఘనత మాదే అన్నారు గతంలో డిగ్రీ చదవాలంటే ఇతర ప్రాంతాలకు వెళ్లే వారిని అలాంటి సమస్యలు రాకుండా ఉండేందుకే డిగ్రీ కాలేజీ తెచ్చి ఒకటవ తరగతి నుండి డిగ్రీ వరకు ఎద్దుల పాపమా ప్రభుత్వ కళాశాలలో చదివే విధంగా ఏర్పాటు చేశామన్నారు ఆళ్లగడ్డలో 30 పడకల ఆసుపత్రి నుండి 50 పడకల ఆసుపత్రి 4 నెలల కిందట ప్రారంభించామన్నారు. అలాగే పట్టణంలో కోటి రూపాయలతో అర్బన్ హెల్త్ సెంటర్ ఏర్పాటు చేశామన్నారు ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమాలు కావా ఇవన్నీ కనబడలేదా అని ఆయన అన్నారు మాకు చేతల్లో చేయడం తెలుసు కానీ కేవలం మాటలు చెప్పడం మైకు ముందు పెడితే పూనుకొని వచ్చినట్లు మాట్లాడడం తెలియదని నోటికి వస్తే అపార్ధాలు చెప్పడం మాకు చేతకాదని చేతనైతే కచ్చితంగా పని చేసి చూపిస్తాం ప్రజల సేవ చేయడానికి మేమున్నామని ఎన్నికలు వస్తున్నాయని ఇలాంటి నాటకాలు చేయడం మా వల్ల కాదని ప్రజలను ఏ విధంగా మోసం చేసి గద్దెనెక్కాలని ఆలోచనను ఎప్పటికీ రావని ఎమ్మెల్యే గంగులన్నారు. అనంతరం ఆదిమూలపు సురేషు అంజాద్ భాష ప్రసంగించారు. ముగ్గురు టిట్కో గృహదారులకు ఇంటి పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ డాక్టర్ రామలింగారెడ్డి విజయ మిల్క్ డైరీ చైర్మన్ ఎస్ వి జగన్మోహన్ రెడ్డి ఎంపీపీ రాఘవేంద్ర రెడ్డి ఆర్డీవో శ్రీనివాసులు టిడ్కో సి ఇ కృష్ణారెడ్డి, ఎస్సీ రాజశేఖర్ రెడ్డి మార్కెట్ యార్డ్ చైర్మన్ గంధం రాఘవరెడ్డి రాష్ట్ర ముస్లిం మైనారిటీ వైకాపా కార్యదర్శి షేక్ బాబూలాల్ కమిషనర్ ఏవి రమేష్ బాబు మాజీ వ్యవసాయ మార్కెట్ యార్డ్ వై చైర్మన్ గోపవరం నరసింహారెడ్డి కౌన్సిలర్ సుధాకర్ రెడ్డి తాసిల్దార్ హరినాధరావు గంగుల రామిరెడ్డి సలాం గుత్తి రంగ యాదవ్ సిఐ రమేష్ బాబు, ఎస్సైలు నరసింహులు వెంకటరెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్ నాయిబ్ రసూల్ మాదం మరియమ్మ, నజీర్ అజాద్ కౌన్సిలర్లు వైకాపా నాయకులు లబ్ధిదారులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News