Sunday, October 6, 2024
Homeఆంధ్రప్రదేశ్APUWJ Nagaraju: జర్నలిస్టుల సంక్షేమాన్ని విస్మరించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు

APUWJ Nagaraju: జర్నలిస్టుల సంక్షేమాన్ని విస్మరించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు

ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షులు నాగరాజ్ గౌడ్

జర్నలిస్టుల సంక్షేమాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని ఏపీడబ్ల్యూజే జిల్లా అధ్యక్షులు నాగరాజు గౌడ్ అన్నారు. ఆలూరు పట్టణంలోని శ్రీ వాసవి కళ్యాణ మండపంలో ఆలూరు తాలూకా ఏపీడబ్ల్యూజే మహాసభ ప్రెస్ క్లబ్ కన్వీనర్ రాజేష్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలూరు తాలూకా అధ్యక్ష కార్యదర్శులు ఎన్నికైన సురేష్, చంద్రబాబుతో పాటు మరో 15 మంది కార్యవర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా టిడిపి రాష్ట్ర కార్యదర్శి వైకుంఠం మల్లికార్జున చౌదరి బళ్ళారి డిప్యూటీ మేయర్ శశికళ కృష్ణమోహన్ జెడ్పిటిసి విరుపాక్షి దేవనకొండ మాజీ ఎంపీపీ కప్పట్రాళ్ల రామచంద్ర నాయుడు, టిడిపి తాలూకా నాయకులు రఘు ప్రసాద్ రెడ్డి, మండల కన్వీనర్ అశోక్, ఆలూరు సిఐ వెంకటేశ్వర్లు సిపిఐ నాయకులు బుపేశ్, రామాంజినేయులు,
హాజరయ్యారు. ప్రజా సమస్యలపై ప్రతినిత్యం పనిచేస్తున్న జర్నలిస్టుల సేవలు అభినందనీయమని జర్నలిస్టులకు సంక్షేమానికి తాము చేస్తామని అన్నారు. ఈ సందర్భంగా బళ్ళారి డిప్యూటీ మేయర్ శశికళ, కృష్ణ మోహన్ అధ్వర్యంలో లో జర్నలిస్టులు లకు వాచ్ లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు హరి కిషన్, అంజి, సుంకన్న స్వరూప్ శ్రీధర్, చంద్రమోహన్ రాజేష్ గౌడ్, చాంద్, హనుమేష్ మహేష్, బాషా, ఎమ్మిగనూరు అద్యక్షులు శ్రీనివాస్ నాయుడు, మండల కార్యదర్శి రాజు, తాలూకా గౌరవ అధ్యక్షులు యశోద కుమార్, సలహాదారు కోటి, తీమన్న పాల్గొన్నారు. అనంతరం జర్నలిస్టుల సంక్షేమ నిధికి టిడిపి రాష్ట్ర కార్యదర్శి వైకుంఠం మల్లికార్జున 20 వేలు, మాజీ ఎంపీపీ రామచంద్ర నాయుడు రూ.10 వేలు విరాళం ప్రకటించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News