Sunday, October 6, 2024
Homeఆంధ్రప్రదేశ్Gudivada : వంగవీటి రంగా వర్థంతి.. రణరంగంగా గుడివాడ.. మాజీ ఎమ్మెల్యేకు ప్రాణహాని

Gudivada : వంగవీటి రంగా వర్థంతి.. రణరంగంగా గుడివాడ.. మాజీ ఎమ్మెల్యేకు ప్రాణహాని

గుడివాడలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. నేడు (డిసెంబర్ 26) వంగవీటి రంగా వర్థంతిని పురస్కరించుకుని టీడీపీ నేతలు ఏర్పాట్లు చేసుకుంటున్న నేపథ్యంలో మాజీ మంత్రి అనుచరుడొకరు టీడీపీ గుడివాడ నియోజకవర్గ ఇన్‌ఛార్జి రావి వెంకటేశ్వరరావుకు ఫోన్‌ చేశారు. రంగా వర్ధంతి నిర్వహించొద్దని హెచ్చరించారు. ఎక్కువ మాట్లాడితే.. నిన్ను లేపేస్తా అని వార్నింగ్ కూడా ఇచ్చాడు. తాము రంగా వర్థంతిని నిర్వహించి తీరుతామని చెప్పి ఫోన్ కట్ చేసిన కాసేపటికే.. స్థానిక టీడీపీ కార్యాలయంపై దుండగులు దాడికి తెగబడ్డారు. పెట్రోల్‌ ప్యాకెట్లు విసిరి నిప్పంటించేందుకు ప్రయత్నించారు. కర్రలు, కత్తులతో దాడి చేశారు.

- Advertisement -

ఇదంతా చూసిన స్థానికులు.. ఆ మాజీమంత్రి పనేనంటున్నారు. టీడీపీ కార్యాలయంపైకి విసిరిన పెట్రోల్ ప్యాకెట్లకు నిప్పంటుకోకపోవడంతో పెనుప్రమాదం తప్పిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఆ సమయంలో అక్కడే ఉన్న పోలీసులు దాడిని అడ్డుకోవాల్సింది పోయి.. ప్రేక్షకపాత్ర వహించారని బాధితులు చెబుతున్నారు. ఈ ఘటనను నిరసించిన వారిపై లాఠీఛార్జి చేయడం గమనార్హం. ఇదంతా ఒక ఎత్తైతే.. అక్కడి పరిస్థితిని, జరుగుతున్న హింస, విధ్వంస కాండను కవర్ చేస్తున్న విలేకరులపైనా దుండగులు దాడి చేశారంటే.. పరిస్థితి ఎంత ఉద్రిక్తతకు దారితీసిందో అర్థం చేసుకోవచ్చు. విషయం తెలుసుకున్న రావి వర్గీయులు అక్కడికి చేరుకోగా.. వైసీపీ-టీడీపీ నేతలు, కార్యకర్తల మధ్య వాగ్యుద్ధం, కొట్లాట జరిగినట్లు తెలుస్తోంది. తమపై, టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడిపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు స్థానిక పోలీసులకు కంప్లైంట్ చేసినా కేసు నమోదు చేయలేదు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News