ఇవి బ్లడ్ షుగర్ ను తగ్గిస్తాయి..
బ్లడ్ షుగర్ ప్రమాణాలను తగ్గించే ఫుడ్స్ ఉన్నాయి. అవి బ్లడ్ షుగర్ ప్రమాణాలను ఎంతో శక్తివంతంగా క్రమబద్ధీకరిస్తాయి . పెసలు, రాజ్మా, శెనగలు వంటి పప్పుధాన్యాలు డయాబెటిస్ ను బాగా అదుపులో ఉంచుతాయి. వీటిల్లో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా, ప్రొటీన్లు, పీచుపదార్థాలు ఎక్కువగా ఉండడమే ఇందుకు కారణం. అలాగే శరీరానికి కావలసిన యాంటాక్సిడెంట్లు, హైపోగ్లైసిమిక్ గుణాలు కూడా
వీటిల్లో ఉంటాయి.
పోలిఫెనాల్స్ ను సైతం సంరక్షిస్తాయి. బ్రకోలీ, పాలకూర, బీన్స్ వంటి ఆకుకూరలు, కూరగాయలు కడుపును నిండుగా ఉంచడంతో తొందరగా ఆకలి వేయదు. ఈ కూరగాయలు గుండె ఆరోగ్యాన్ని సంరక్షించడమే కాకుండా బ్లడ్ షుగర్ ప్రమాణాలను క్రమబద్ధీకరిస్తాయి. బిపి పెరగకుండా చేస్తాయి. బాదం, వాల్ నట్స్ లలో ప్రొటీన్లు పుష్కలంగా ఉన్నాయి. వీటిల్లో పీచుపదార్థాలతో పాటు ఒమేగా 3 ఫ్యాటీయాసిడ్స్ కూడా ఉన్నాయి. ఈ నట్స్ మెల్లగా జీర్ణమవడంతో బ్లడ్ షుగర్ ప్రమాణాలు శక్తివంతంగా అదుపులో ఉంటాయి.
కాకరకాయ కూడా డయాబెటిస్ వ్యాధిగ్రస్థులకు ఎంతో మంచిది. దీన్ని రసంగా చేసి తాగితే మంచి ఫలితాలు చూడొచ్చు. మరెన్నో ప్రయోజనాలను పొందుతాం కూడా. కాకరలో మెడిసినల్ గుణాలు
ఎన్నో ఉన్నాయి. ఇది డయాబెటిస్ ను కూడా మెల్లగా తగ్గిస్తుంది. మెంతులను రాత్రి నీళ్లల్లో నానబెట్టి ఉదయం వాటిని ఖాళీ కడుపుతో తాగాలి. ఇలా చేయడం వల్ల కార్బోహైడ్రేట్లను శరీరం మెల్లగా
గ్రహిస్తుంది.