Friday, November 22, 2024
Homeఆంధ్రప్రదేశ్Guduvada:గుడివాడలో కొడాలి నానిపై నందమూరి అస్త్రం.. బాబు వ్యూహం

Guduvada:గుడివాడలో కొడాలి నానిపై నందమూరి అస్త్రం.. బాబు వ్యూహం

Guduvada: ఆంధ్రప్రదేశ్ లో పోలిటికల్ హీట్ పీక్స్ కి చేరిపోయింది. ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉన్నా.. ఇప్పుడో ఇహనో ఎన్నికల నగారా మోగుతుందా అన్నట్లుగా అధికార ప్రతిపక్షాలలో అలజడి, హడావుడి కనిపిస్తోంది. ముఖ్యంగా తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయడు రానున్న ఎన్నికలకు చావో రేవో అన్నట్లుగా సిద్ధమైపోయారు. అత్యధిక స్థానాలలో విజయం సాధించి రాష్ట్రంలో మరో సారి తెలుగుదేశం ప్రభుత్వాన్ని తీసుకురావాలన్న లక్ష్యంతో పాటుగా ఆయన గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గవంలో తెలుగుదేశం జెండా ఎగిరి తీరాలన్న పట్టుదల కూడా ప్రదర్శిస్తున్నారు. తనపైనే కాకుండా తన సతీమణిపై కూడ అనుచిత వ్యాఖ్యలు చేయడమే కాకుండా అసభ్య పదజాలాన్ని ప్రయోగిస్తున్న నానికి చెక్ పెట్టాలన్న కృత నిశ్చయంతో చంద్రబాబు ఉన్నారు.

- Advertisement -

నోటికి హద్దు, అదుపూ లేకుండా బూతుల పురాణంతో తన కుటుంబాన్ని టార్గెట్ చేసుకుని విరుచుకు పడే కొడాలి నాని మళ్లీ అసెంబ్లీ ముఖంగా చూడకుండా చేయాలన్న లక్ష్యంగా చంద్రబాబు వ్యూహాలకు పదును పెడుతున్నారు. కొడాలి నానికి చెక్ పెట్టేందుకు ఆయన ఈ సారి నందమూరి అస్త్రాన్ని సంధించనున్నారని తెలుగుదేశం వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇంత కాలం కొడాలి నాని విజయాలకు వెనుక నందమూరి హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల పాత్ర భారీగా ఉంటూ వస్తోందనేది కాదనలేని సత్యం. కొడాలి నానికి ఓట్లు వేయడంలో గానీ, వేలాది మంది చేత ఓట్లు వేయించడంలో గానీ హరికృష్ణ, ఎన్టీఆర్ ఫ్యాన్స్ గట్టిగా కృషి చేశారని చెబుతారు. కొడాలి నానికి కలిసివస్తున్నఈ అంశాన్నే బ్రేక్ చేయాలని టీడీపీ అధినేత వ్యూహాలు రచిస్తున్నారని అంటున్నారు. నందమూరి హరికృష్ణ కుమార్తె, జూనియర్ ఎన్టీఆర్ సోదరి నందమూరి సుహాసినిని వచ్చే ఎన్నికలలో గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలో దింపితే కొడాలి నాని హవాకు ఫుల్ స్టాప్ పడటం ఖాయమని ఆయన భావిస్తున్నారంటున్నారు.

అంతకు ముందు గత ఎన్నికల్లో కొడాలి నానిపై టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి ఓటమి చవిచూసిన రావి వెంకటేశ్వరరావునే బరిలో దింపాలని తొలుత చంద్రబాబు యోచించారని, అయితే.. కొడాలి నానిని ఢీకొట్టాలంటే..వెంకటేశ్వరరావు బలం, బలగం సరితూగకపోవచ్చన్న అనుమానం వ్యక్తం కావడంతో మరో బలమైన అభ్యర్థి కోసం చూస్తున్నారనీ, ఈనేపథ్యంలోనే పలు ఆప్షన్స్ ను పరిశీలించి చివరకు నందమూరి సుహాసిని రంగంలోకి దింపాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలుగుదేశం వర్గాలు చెబుతున్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News