Friday, November 22, 2024
Homeహెల్త్Lose weight quickly: తొందరగా సన్నబడాలంటే?

Lose weight quickly: తొందరగా సన్నబడాలంటే?

అసాద్యం కాదు.. తొందరగా బరువు తగ్గటం కష్టసాధ్యమే

స్లిమ్ కావాలంటే …

- Advertisement -

వేగంగా సన్నబడాలనుకుంటున్నారా? అయితే అది అనుకున్నంత సులభం మాత్రం కాదు. కాలరీలు తక్కువగా తీసుకుంటూ, డైటింగ్ తో సాధించే విషయమూ ఇది కాదు. లావు తగ్గడానికి అవి సంపూర్ణమైన
పద్ధతులు కూడా కావు. కాలరీలు లెక్కించుకుంటూ తింటే బరువు తగ్గుతారని అనుకోవద్దు. ఈ పద్ధతలు కేవలం స్వల్పకాలిక ఫలితాలను మాత్రమే ఇస్తాయి. లావు తగ్గి స్లిమ్ కావడానికి నిరూపితమైన కొన్ని
చిట్కాలు లేకపోలేదు.

వాటిల్లో ముఖ్యమైంది నిత్యం గ్రీన్ తాగడం. ఇలా చేయడం వల్ల మంచి ఫలితాలు చూస్తారు. గ్రీన్ టీలోని కెటాచిన్స్ అనే యాంటాక్సిడెంట్లు శరీరాన్ని డిటాక్సిఫై చేస్తాయి. శరీరంలోని వాపును సైతం తగ్గిస్తాయి. కెటాచిన్స్ వల్ల కార్డియోవాస్క్యులర్ జబ్బుల రిస్కున పడరు. అందుకే రోజుకు రెండు కప్పుల గ్రీన్ టీ తాగితే
శరీరంలోని మలినాలన్నీ బయటకు పోతాయి. అలాగే రోజులో మీరు తినే మీల్స్ లో ప్రొటీన్లు ఉండేలా చూసుకోవాలి. ఇవి కండరాలను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఎక్కువ ప్రొటీన్లు ఉన్న డైట్ తీసుకోవడం వల్ల
బరువు తగ్గుతారని పలు అధ్యయనాల్లో కూడా తేలింది. గుడ్లు, స్కిన్ లెస్ చికె బ్రెస్ట్, పుట్టగొడుగులు, చేపలు, టోఫు, పప్పులు, బీన్స్, సోయా, నట్స్ , గింజలు, పాలు వంటి వాటిల్లో ప్రొటీన్లు బాగా ఉంటాయి.

కూరగాయలు, పండ్లు ఎక్కువగా తినడం వల్ల కూడా బరువు వేగంగా తగ్గుతారు. వీటల్లో డైటరీ ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి. పండ్లు, కూరగాయల్లో కాలరీలు తక్కువగా ఉంటాయి. ఇవి కడుపు నిండుగా ఉండేలా చేయడమే కాదు ఆకలి కూడా వేయదు. క్రేవింగ్స్ ఉండవు. పండిన అరటిపళ్లల్లో చక్కెర శాతం బాగా ఉంటుంది కాబట్టి వాటిని తినకుండా ఉండడం మంచిది. బరువు వేగంగా తగ్గాలంటే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ బాగా పనిచేస్తుంది. ఇలా చేయడం వల్ల ఎల్ డిఎల్ ప్రమాణాలు తగ్గడంతో పాటు ట్రైగ్లిజరైడ్స్ కూడా బాగా తగ్గుతాయి.

బరువు వేగంగా తగ్గాలని రిఫైన్డ్ షుగర్ వాడుతుంటారు. ఆ పని మానమంటున్నారు నిపుణులు. షుగర్, సోడా, డైట్ సోడా, కేక్స్, పేట్రీస్, కప్ కేక్స్, పాలు, చాక్లెట్, వైట్ చాక్లెట్, కాండీస్, పాన్ కేక్ కప్స్, ఫ్రుక్టోస్ ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలకు బాగా దూరంగా ఉండాలి. చక్కెర కారణంగా శరీరంలో వాపు
ఎక్కువవుతుంది. ఫలితంగా ఇన్ఫ్మేషన్ ఇండ్యూస్డ్ వెయిట్ గైన్ ఎదుర్కొంటారు. మధ్య వయస్కులైన స్త్రీలు భోజనానికి ముందు 500 ఎంఎల్ నీరు తాగడం వల్ల బరువు బాగా తగ్గుతారని ఒక పరిశీలనలో వెల్లడైంది.

మీరుంటున్న వాతావరణం, మీరు చేస్తున్న పనులను బట్టి రోజుకు రెండు నుంచి నాలుగు లీటర్ల నీళ్లు తాగాలి. ఒమేగా 3 పోలీ అన్శాచ్యురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న ఆహారపదార్థాలు తినడం శరీరానికి ఎంతో మంచిది. నట్స్, సాల్మన్, ట్యూనా, మకెరెల్, శార్డినెస్, ఆలివ్ , ఆయిల్ , సన్ ఫ్లవర్ సీడ్స్, మెలన్ సీడ్స్ వంటివి తినాలి. ఇంట్లో మీ వంట మీరే వండుకోవడం వల్ల ఎక్కువ కాలరీలు శరీరంలోకి వెళ్లవు. అలాగే చిన్న చిన్న పరిమాణాల్లో ఆహారం తినడం అలవాటు చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల బరువు బాగా తగ్గుతారు. అలాగే మీరేమి తింటున్నారన్న దానిపై దృష్టిపెట్టాలి.

అన్నం మెల్లగా నమిలి తింటే తొందరగా జీర్ణం అవుతుంది. బ్లాక్ కాఫీ వల్ల కూడా బరువు తగ్గుతాం. ఇదులోని కెఫైన్ బిఎంఐ ని తగ్గిస్తుందని స్టడీల్లో వెల్లడైంది. అంతేకాదు ఫ్యాట్ తగ్గేలా కూడా చేస్తుంది. ఊబకాయుల్లో మెటబాలిజం రేటు పెరిగేలా కాఫీ చేస్తుంది. అలాగే ప్రొబయొటిక్స్ ఎక్కువ తీసుకోవాలి. ఇది గుడ్ బాక్టీరియా. వీటివల్ల జీర్ణక్రియ బాగా జరుగుతుంది. ఊబకాయం రిస్కు తగ్గుతుంది. అలాగే ఆరోగ్యకరమైన స్నాక్స్ తింటే కూడా బరువు తగ్గుతారు. ఉదాహరణకు మీరు తినే బ్రెడ్ ను బట్టి సన్నబడతారు. తిన్న అన్నం అరగడానికి రెండు మూడు గంటలు పడుతుంది కాబట్టి డిన్నర్ సాయంత్రం ఏడు లోపల పూర్తిచేస్తే చాలా మంచిదంటున్నారు నిపుణులు.

డిన్నర్ తర్వాత నడిస్తే శరీరానికి చాలా మంచిది. నడవడం వల్ల శరీరానికంతటికీ వ్యాయామం మాత్రమే కాదు మైడ్ కూడా రిలాక్స్ అవుతుంది. అర్థరాత్రుళ్లు చిరుతిళ్లు తినే అలవాటును వదులుకోవాలి. లేకపోతే ఊబకాయం బారిన పడతారని వైద్యులు చెప్తున్నారు. రన్నింగ్ మంచి కార్డియో వ్యాయామం. పరిగెత్తడం వల్ల శరీరంలోని కొవ్వు మొత్తం కరుగుతుంది. ఊపిరితిత్తుల సామర్థ్యం పెరుగుతుంది. ఇతర ఎరోబిక్స్ కూడా చేస్తే శరీరానికి ఎంతో మంచిది. స్ట్రెంగ్త్ ట్రైనింగ్ వల్ల కండరాలు బలపడతాయి. ఏదో ఒక క్రీడను నిత్యం ఆడితే కూడా శరీరానికి ఎంతో మంచిది. మెట్లు ఎక్కడం కూడా శరీరానికి మంచి వ్యాయామం. నిద్ర
లేమి ఊబకాయాన్ని పెంచుతుంది. అందుకే రోజుకు కనీసం ఏడు గంటల నిద్ర అవసరం. దీంతో మైండ్ ఉత్సాహంగా ఉంటుంది.

పనుల ఒత్తిడి నుంచి మిమ్మల్ని మీరు రిలాక్స్ చేసుకోవాలి. డిస్ట్రెస్ కావాలి. రొటీన్ పనుల నుంచి అప్పుడప్పుడు బ్రేక్ తీసుకుంటుండాలి. ఏవైనా కొత్త ప్రదేశాలకు వెడుతుండాలి. ఇది మిమ్మల్ని డిస్ట్రెస్ చేయడమే కాకుండా మీ పనిని ఉల్లాసంగా చేసుకోగలిగే ప్రేరణను శరీరానికి తిరిగి ఇస్తుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News