ఈస్థటిక్ ప్రొసీజర్లకు పెరుగుతున్న ఆదరణ
మనదేశంలో ఈస్థటిక్ ప్రొసీజర్ల ట్రెండు ఇటీవల బాగా పెరిగిందని ఒక రిపోర్టులో వెల్లడైంది. రకరకాల బ్యూటీ ట్రీట్మెంట్లపై ప్రజల్లో అవగాహన బాగా పెరగడం ఇందుకు కారణమని ఆ రిపోర్టు అభిప్రాయపడింది. ఈ ట్రెండు పెరగడానికి సోషల్ మీడియా కూడా ఒక కారణమని గ్లోబో డేటా అనే డేటా ఎనలిటిక్స్ కంపెనీ రూపొందించిన ఈ రిపోర్టులో పేర్కొంది.
2023 సంవత్సరంలో ఏసియా ఫసిఫిక్ ఈస్థటిక్స్ ఇంజక్ట్ బుల్స్ మార్కెట్ రెవెన్యూ లో భారత్ ది ఒక శాతం వరకూ ఉందని రిపోర్టు పేర్కొంది. ఈస్థటిక్స్ ఇంజక్టబుల్స్ అయిన బొట్యూలినమ్ టాక్సిన్ (బొటాక్స్), హిలోరోనిక్, నాన్ హిలొరోనిక్ యాసిడ్ ఫిల్లర్స్ నాన్ సర్జికల్, నాన్ ఇన్వేసివ్ కావడం వల్ల చాలామందిలో వీటి వినియోగం ఎక్కువైందని ఈ రిపోర్టు వెల్లడిస్తోంది. కోవిడ్ సంక్షోభంతో చాలామందికి తమ చర్మ స్వభావంతో పాటు చర్మం ఎలాస్టిసిటీ, హైడ్రేషన్, మృదుత్వం వంటి వాటిని సర్జరీతో పనిలేకుండా
చేయించుకునే అవకాశాలు ఉండడతో వీటి క్రేజ్ పెరిగిందని కూడా ఈ రిపోర్టు పేర్కొంది.
అంతేకాకుండా ప్రజలు కూడా తమ సంపాదనలో కొంత భాగం తమ ఈస్టటిక్ అవసరాల కోసం కేటాయిస్తున్న ట్రెండు కూడా బాగా పెరిగిందని రిపోర్టు ప్రస్తావించింది. దాంతో ఇంజక్టబుల్ ఫిల్లర్స్ వినియోగం కూడా అదే స్థాయిలో పెరిగింది. ఈ రంగంలో పెరిగిన ఆధునిక పరిజ్ఘానం, సర్జన్లు, వైద్య ఉపకరణాలు సైతం సౌందర్య సాధన పట్ల ప్రజల్లో బాగా ఆసక్తి పెరిగేలా చేస్తోందని ఈ రిపోర్టు పేర్కొంది.