Friday, September 20, 2024
Homeపాలిటిక్స్MLA Anjayya Yadav: పార్టీలకతీతంగా పలికే ఎమ్మెల్యే

MLA Anjayya Yadav: పార్టీలకతీతంగా పలికే ఎమ్మెల్యే

బీఆర్ఎస్ లో ఊపందుకున్న చేరికలు

నందిగామ గ్రామానికి చెందిన మాజీ ఎంపిటిసి ఎర్ర అంజయ్య గౌడ్ కుటుంబ సభ్యులు ప్రముఖ విద్యావేత్త ఎర్ర రామేశ్వర్ గౌడ్, ఎర్ర ప్రభాకర్ గౌడ్, ఎర్ర శ్రీనివాస్ గౌడ్, ఎర్ర శ్రీకాంత్ గౌడ్, మధుసూదన్ గౌడ్ తో పాటు పలువురు యువకులు బిఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్న కేసీఆర్ ప్రభుత్వానికి ప్రతి ఒక్కరూ మద్దతుగా నిలవాలని కోరారు. ప్రముఖ విద్యావేత్త రామేశ్వర్ గౌడ్ మాట్లాడుతూ.. ఆప్యాయత, అనురాగాలకు మారుపేరుగా నిలిచిన ఎమ్మెల్యే అంజయ్య యాదవ్, పార్టీలకు అతీతంగా ఫోన్ అంజయ్య యాదవ్ కు ఫోన్ చేస్తే హలో అని లిఫ్ట్ చేసి సమాధానం ఇచ్చే ఏకైక నాయకుడు అంజన్న, అందుకే మరోసారి భారీ మెజారిటీతో గెలుపొందాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ గెలుపు కోసం తమ వంతు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేష్, నందిగామ సర్పంచ్ జిల్లెల వెంకట్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నారాయణరెడ్డి, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పద్మారెడ్డి, మాజీ సర్పంచ్ రామ్ రెడ్డి, ఉప సర్పంచ్ మెక్కొండ కుమార్ గౌడ్, నాయకులు విక్రం శర్మ, పెంటయ్య గౌడ్, తుప్పుడు కిష్టయ్య, రాములు, రామచంద్రయ్య, నాన్నగారి అంజయ్య, బాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News