Thursday, April 10, 2025
HomeతెలంగాణManchiryala: పిఎస్ఆర్ పై మండిపడ్డ ఎమ్మెల్యే దివాకర్

Manchiryala: పిఎస్ఆర్ పై మండిపడ్డ ఎమ్మెల్యే దివాకర్

తాను అక్రమ ఆస్తులు కూడబెట్టినట్టు రుజువు చేస్తే..ఎన్నికల్లో పోటీ చేయకుండా తప్పుకుంటానని సవాలు చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్ రావు. తన కుమారుడు విజిత్ ఎక్కడ అన్యాయంగా, అక్రమాలకు పాల్పుడుతున్నాడో తేల్చాలన్నారు. ప్రేమ్ సాగర్ రావు తనపై లేనిపోని నిందారోపణలు చేస్తున్నట్టు నడిపెల్లి నిప్పులు చెరిగారు.

- Advertisement -

నేను కష్టపడి వ్యాపారం చేసి ఉద్యోగం చేసి సంపాదించుకున్నానని గుర్తు చేశారు నడిపెల్లి. కోఆపరేట్ ఎన్నికలలో డబ్బులు పంపిస్తున్నాను అన్న పీఎస్ఆర్, జైపూర్ పవర్ ప్లాంట్ గురించి అప్పుడు రోశయ్య ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పవర్ ప్లాంట్ లో షేర్ ఇస్తాను అని అన్నది నిజం కాదా అంటూ ప్రేమ్ సాగర్ ను నిలదీశారు. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు జిల్లాలో మోడల్ స్కూల్ కాంటాక్ట్ తీసుకొని కొన్ని ఏరియాలలో స్లాబ్ వేయకుండానే బిల్లులు తీసుకున్న ఘనత నీది కాదా అంటూ పీఎస్ఆర్ పై ఆరోపణలు చేశారు.
ఎమ్మెల్యేగా నేను వ్యాపారులకు మనవి చేస్తున్నాను ప్రేమ్ సాగర్ రావుకు మీరిచ్చిన అప్పులు వెంటనే తిరిగి తీసుకోండి మళ్ళీ అతనికి ఎవరూ అప్పులివ్వకండి అని ఘాటు వ్యాఖ్యలు మీడియా ముఖంగా నడిపెల్లి చేయటం సంచలనం సృష్టిస్తోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News