Saturday, October 5, 2024
Homeఆంధ్రప్రదేశ్AP Govt: మద్యం షాపుల్లో ఇకపై డిజిటల్ చెల్లింపులు.. కిక్కే కిక్కు!

AP Govt: మద్యం షాపుల్లో ఇకపై డిజిటల్ చెల్లింపులు.. కిక్కే కిక్కు!

- Advertisement -

AP Govt: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మద్యపాన నిషేధం గురించి తెలిసిందే. ఎన్నికలకు ముందు పాదయాత్రలో రాష్ట్రంలో మద్యపాన నిషేధం చేస్తామని హామీ ఇచ్చారు. ఇక అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో బెల్టు షాపులు లేకుండా చేసి, గతంలో ప్రైవేట్ పరంగా నడిచే మద్యం షాపులను ప్రభుత్వమే నడుపుతుంది. ఈ షాపులను ప్రతి ఏడాది తగ్గించుకుంటూ చివరికి మద్యం ఫైవ్ స్టార్ హోటళ్లలో మాత్రమే దొరికే స్థితికి తీసుకొస్తామని చెప్పారు.

మద్యపాన నిషేధంలో భాగంగానే గతంలో సీఎం జగన్ రాష్ట్రంలో మద్యం ధరలను ఏ రాష్ట్రంలో లేనంతగా పెంచేశారు. దీంతో ఒక్కసారి భారీగా ఆదాయం పడిపోయింది. ఎంత అడ్డుకున్నా ఇతర రాష్ట్రాల నుండి అక్రమ మద్యాన్ని, నాటుసారా తయారీని అరికట్టడం ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. దీంతో మళ్ళీ దఫాలుగా మద్యం ధరలను తగ్గించి పొరుగు రాష్ట్రాలతో సమానంగా తీసుకొచ్చారు. అంతకి ముందు ఈ ప్రభుత్వ షాపుల్లో ప్రీమియం బ్రాండ్లు కూడా పెద్దగా లేకపోగా ఆ తర్వాత ప్రీమియమ్ బ్రాండ్లు కూడా అందుబాటులోకి తెచ్చారు.

అయితే, ఇప్పటి వరకు ఏపీ ప్రభుత్వ మద్యం షాపుల్లో డిజిటల్, ఆన్ లైన్ ప్రెమెంట్లు లేవు. కేవలం నగదు చెల్లింపులు మాత్రమే ఉండగా ఇప్పుడు డిజిటల్ ప్రెమెంట్స్ తీసుకొస్తున్నారు. నవంబర్ 21 నుంచి నగదు చెల్లింపులతో పాటు కార్డు స్వైపింగ్, యూపీఐ, క్యూఆర్ కోడ్ తదితర చెల్లింపులు అనుమతిస్తామని ఏపీ ప్రభుత్వం చెబుతోంది. మద్యం అమ్మకాలు తగ్గించాలనేది జగన్ ప్రభుత్వ పాలసీ కాగా.. ఇలా వెసులుబాటు చెల్లింపులు ఏంటని ప్రశ్నిస్తే.. షాపుల్లో సిబ్బంది చేతివాటాలను అరికట్టేందుకేనని కవర్ చేసుకుంటున్నారు. మరి కేవలం డిజిటల్ చెల్లింపులేనా? నగదు అమ్మకాలు లేవా అంటే అది కూడా ఉంటుంది. మరి ఆ నగదులో అవకతవకలు జరగవా అనేది ఆ పార్టీ నేతలకే తెలియాలి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News