కల్వకుర్తి నియోజకవర్గం నుండి అసెంబ్లీ బరిలో నిలిచేందుకు ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ రాఘవేందర్ రెడ్డి మొగ్గుచూపుతున్నట్లు విశ్వసనీయ సమాచారం మేరకు కల్వకుర్తి బరిలో నిలుస్తున్నట్లు తెలుస్తోంది. అమెరికా పౌరసత్వం వదులుకొని తన పురిటి గడ్డ రుణం తీర్చుకునేందుకు కల్వకుర్తి నియోజకవర్గంలో అడుగుపెట్టి తన సేవల ద్వారా తనకంటూ ఓ ముద్ర వేసుకున్న నాయకుడు సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి. కల్వకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ టికెట్ను ఆశించిన సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డికి అధిష్టానం నుండి ఎలాంటి స్పష్టమైన హామీ లభించకపోవడంతో తను ఇండిపెండెంట్గా బరిలో నిలిచేందుకు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ఐక్యత ఫౌండేషన్ ద్వారా విద్య, వైద్యం, ఉపాధి, కల్పన ధ్యేయంగా పెట్టుకుని నిరంతర కృషి చేసి ఎన్నో సేవలు అందించారు. పురాతనమైన దేవాలయాలను పునర్నిర్మించడంతోపాటు, ప్రతి గ్రామంలో నూతన దేవాలయాలు నిర్మించుకునేందుకు తన ఐక్యత ఫౌండేషన్ ద్వారా సొంత డబ్బులతో దేవాలయాలను నిర్మించడం జరిగింది. పేదలకు వైద్యం అందాల అన్న లక్ష్యంతో ఆమనగల్లులో మూడు అంబులెన్సులు, కల్వకుర్తిలో ఆరు అంబులెన్స్లను తన ఐక్యత ఫౌండేషన్ ద్వారా ఏర్పాటు చేశారు. ప్రభుత్వ పాఠశాలలో సరైన వసతులను తన ఫౌండేషన్ ద్వారా కల్పిస్తూ తనదైన ముద్ర వేసుకున్నాడు. తన సేవలు ఇలా ఉంటే, కల్వకుర్తి నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీ తరఫున కల్వకుర్తి బరిలో నిలిచేందుకు టికెట్ ఆశించి భంగపడ్డ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి ఈసారి ఎలాగైనా కల్వకుర్తి అసెంబ్లీ బరిలో నిల్చోవాలని ఆశిస్తున్నారు. పార్టీ కష్ట కాలంలో ఉన్నప్పుడు కల్వకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడిన తనకు టికెట్ ఇవ్వకపోవడం బాధాకరమని అన్నారు. కల్వకుర్తి నియోజకవర్గం నుండి సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిల్వాలని, బరిలో కచ్చితంగా ఉంటానని తన అభిమానులకు, తన వెంట నడిచే కార్యకర్తలకు భరోసా ఇచ్చినట్లు తెలుస్తోంది. తాను అమెరికా పౌరసత్వం వదిలి ప్రజా సేవ చేసేందుకే తన మాతృ గడ్డపై అడుగు పెట్టానని, ఎవరు ఎన్ని జిమ్ముక్కులు చేసినా తన సేవలు ఆగమని, పేద ప్రజల పక్షాన నిలుస్తానని పేద ప్రజల అభివృద్ధి తన లక్ష్యం అని ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి అన్నారు. జరగబోయే అసెంబ్లీ ఎన్నికలలో తనకు అవకాశం కల్పిస్తే కల్వకుర్తి నియోజకవర్గ అభివృద్ధి అంటే ఏమిటో చూపిస్తానని, తాను ఎమ్మెల్యేగా ఉంటే ఎంతగానో అభివృద్ధి చేస్తానని ప్రజలకు హామీ ఇస్తున్నాడు. కల్వకుర్తిలో కాంగ్రెస్ పార్టీ ఎదుగుదలకు తోడ్పడిన తనకు టికెట్ ఇవ్వకపోవడం ఎంతో బాధాకరమని, పార్టీ ద్వారా ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిచి ప్రజలకు ఎంతో సేవ చేయాలన్న లక్ష్యంతో వచ్చానని, అలాంటి సమయంలో తనకు టిక్కెట్టు దక్కకపోవడం విడ్డూరంగా ఉందని అన్నారు. సర్వేల ప్రకారం టికెట్ కేటాయిస్తామన్న అధిష్టానం చేసిన సర్వేలు ఎటుపోయాయని సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి ప్రశ్నించారు. అధిష్టానం చేపట్టిన సర్వేలలో సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి కే సర్వేలు మొగ్గుచూపు అని కల్వకుర్తి కాంగ్రెస్ పార్టీ టికెట్ రాఘవేందర్ రెడ్డికే కేటాయిస్తే విజయం వరిస్తుందని సర్వేలు తేల్చి చెప్పాయని అన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థిత్వం కోసం దరఖాస్తు చేసుకున్న నేతలకే టికెట్లు కి ఇస్తామని అధిష్టానం నిర్ణయం ఇప్పుడు ఏమైందని అధిష్టానాన్ని ప్రశ్నిస్తున్నానని తెలిపారు. కష్టపడి పార్టీ కోసం, ప్రజల కోసం నియోజకవర్గ రైతన్నల కోసం నిరంతరం నిచేసే పని చేసే తనలాంటి నాయకులకు కాంగ్రెస్ పార్టీ టికెట్ కేటాయించకపోవడం ఇంతవరకు సమంజసం అని ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి ప్రశ్నించారు. కొత్తగా వచ్చిన పారాషూట్ నాయకులకు టికెట్లు కేటాయించడం ఎంతవరకు కరెక్ట్ నని దానికి పెద్దలు సమాధానం చెప్పాలని అన్నారు. ఏది ఏమైనా తాను స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలుస్తానని కల్వకుర్తి నియోజకవర్గం ప్రజలకు ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి హామీ ఇస్తున్నారు. ఏది ఏమైనా కల్వకుర్తి నియోజకవర్గం అసెంబ్లీ బరిలో నిలవడం దాదాపు కాయమైనట్లే, సుంకి రెడ్డి రాఘవేంద్ర రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. తాను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచి తన సత్తా ఏంటో చూపుతానని ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రచార రథాలపై సుంకి రెడ్డి రాఘవేందర్ రెడ్డి ఫోటో వేయడం రాఘవేందర్ రెడ్డి కి తెలియదని తెలిపారు. కల్వకుర్తి నియోజకవర్గం ప్రజలు తనకు ఈసారి అవకాశం కల్పిస్తే కల్వకుర్తి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథకంలో నిలిపి చూపెడతానని అన్నారు. సెక్యూరిటీ రాఘవేందర్ రెడ్డి సత్తా ఏమిటో ఇప్పటికే కల్వకుర్తి నియోజకవర్గ ప్రజలకు తెలుసు అని ఆ విషయం నాయకులు తెలుసుకోలేకపోతున్నారని అన్నారు.
Shadnagar: కల్వకుర్తి అసెంబ్లీ బరిలో సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి?
స్వతంత్ర అభ్యర్థిగా పోటీ