శ్రీ వాసవి యువజన సంఘం ఆధ్వర్యంలో దుర్గాష్టమి సందర్భంగా పులి వేషాలు, అమ్మవారి వేషాలు వేయించారు. చాగలమర్రిలో ఎనిమిదవ రోజు దుర్గాష్టమి సందర్భంగా అమ్మవారు శ్రీ మహిషాసురమర్ధిని దేవిగా కొలువు దీరింది. శ్రీ వాసవి యువజన సంఘం ఆధ్వర్యంలో ఆదివారం మధ్యాహ్నం దుర్గాష్టమి సందర్భంగా చిన్న పిల్లలకు పులి వేషాలు వేయించారు. అలాగే అమ్మాయిలకు అమ్మవారి వేషాలు వేయించి అయ్యప్ప స్వామి దేవస్థానం నుంచి స్థానిక అమ్మవారిశాల వరకు రంగులు చల్లుకుంటూ పులి వేషాలు నృత్యం చేసుకుంటూ ఊరేగింపుగా బయల్దేరారు.
నంద్యాల జిల్లా చాగలమర్రి గ్రామంలో నవరాత్రుల్లో భాగంగా ఆదివారం 8వ రోజు అమ్మవారు దుర్గాష్టమి సందర్భంగా శ్రీ మహిషాసురమర్ధిని దేవిగా దర్శనం ఇచ్చింది. చాగలమర్రి గ్రామంలోని అమ్మవారిశాల శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయంలో అమ్మవారిని భక్తిశ్రద్ధలతో భక్తులు దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సభ అధ్యక్షుడు వంకధార లక్ష్మణ బాబు , ధర్మకర్త క్రిష్ణం శివ ప్రసాద్ , కమిటీ సభ్యులు , శ్రీ దేవీ శరన్నవరాత్రుల ఉత్సవ కమిటీ సభ్యులు , శ్రీ వాసవి యువజన సంఘం అధ్యక్షుడు జుటురు ఉదయ్ కుమార్ , కమిటీ సభ్యులు , అవొపా అధ్యక్షుడు సుంకు రాజేష్ , కమిటీ సభ్యులు , భక్తులు తదితరులు పాల్గొన్నారు.