Friday, November 22, 2024
Homeఆంధ్రప్రదేశ్RK Roja : ఇది వెలకట్టలేని గిఫ్ట్ .. మంత్రి రోజా ఎమోషనల్ పోస్ట్

RK Roja : ఇది వెలకట్టలేని గిఫ్ట్ .. మంత్రి రోజా ఎమోషనల్ పోస్ట్

ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా.. సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటుంటారు. నవంబర్ 17న ఆమె పుట్టినరోజు. ఆ రోజుకి 50 వసంతాలు పూర్తయ్యాయి. తన జీవిత ప్రయాణంలో.. ఆ రోజుకి ఒక ప్రత్యేకత ఉందని, అది వెలకట్టలేనిదంటూ.. ఇన్ స్టా హ్యాండిల్ లో ఒక ఎమోషనల్ పోస్ట్ చేశారు.

- Advertisement -

” నా జీవిత ప్రయాణంలో ఈరొజుకి ఓ ప్రత్యేకత ఉంది… నా పుట్టినరోజుకి నా బిడ్డ ఇచ్చిన బహుమతి వెలకట్టలేనిది, అత్యంత అమూల్యమైనది. నా శ్రేయోభిలాషులుగా మీతో పంచుకోవాలనిపించింది.
మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల బాగోగులు ఇంట్లో సొంత మనిషిలా ఎలా గైతే చూస్తున్నారో ఆయన పుట్టిన రోజున ఓ బిడ్డకి బంగారు భవిష్యత్తు నివ్వాలని సంకల్పించి రెండేళ్ళ క్రితం ఈ బంగారుతల్లిని నా కుటుంబంలోకి చేర్చుకుంటూ ఆ బిడ్డ చదువు భాద్యతలు తీసుకున్నాను. అదే అన్నకి ఆబహుమతిగా ఇచ్చాను.

“మనకు నచ్చిన వారి పుట్టిన రోజున బొకేలు బహుమతులు ఇవ్వకుండా ఒక బంగారు తల్లి భవిష్యత్తుకి బాట వెయ్యడం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది.”జగనన్నకి ఎంతో ఇష్టమైన”ఆడపిల్లకి ఉన్నత చదువు” ఆయన పుట్టిన రోజున నేను దత్తత తీసుకున్న పి.పుష్పకుమారికి కలిసి వచ్చింది. నీట్ పరీక్షలో రెండవసారి ర్యాంక్ సాదించి. తిరుపతి పద్మావతి వైద్య కళాశాలలో సీటు సంపాదించి నా పుట్టిన రోజున నాకు రిటర్న్ గిఫ్ట్ గా ఇచ్చింది.

సకాలంలో వైద్యమందక తన తల్లీతండ్రులను పోగొట్టుకున్న పుష్ప డాక్టరై భవిష్యత్తులో ఈ సమాజానికి ఉపయోగపడతాను నన్ను చదివించండి అమ్మ అని నాతో అన్నమాట నాకు ఇప్పటికి కంట తడి పుట్టిస్తోంది. ఆ చిట్టితల్లి సంకల్పానికి నేను నా కుటుంకుటుంబంబం తోడై ఉన్నాము, భవిష్యత్తులో కూడా ఉంటామని తెలియజేస్తూ… నా బిడ్డకి మీరందరూ శుభాకాంక్షలు తెలియజేయండి తనని దీవించండి ఎందుకంటే మీ దీవెనలే మాకు శ్రీరామరక్ష” అని రోజా ఎమోషనల్ పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు అమ్మ అంటే మీలా ఉండాలంటూ కామెంట్స్ చేస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News