సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్స్(సీఏపీఎఫ్)తో నగర పోలీస్ కమీషనర్ సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పోలీసులు పాల్గొన్నారు. ఈసందర్భంగా సీపీ సందీప్ శాండిల్య మాట్లాడుతూ ఎన్నికలకు సంబంధించిన అన్ని విధుల్లో సీఏపీఎఫ్ బలగాలతో సిటీ పోలీసులు పనిచేయాల్సి ఉందన్నారు.అందుకు సంబంధించిన విషయాలను వారికి తెలియజేశారు.క్రిటికల్ పోలింగ్ స్టేషన్లు, ఫ్లయింగ్ స్క్వాడ్ విధుల గురించి వారికి వివరించారు మరియు కీలకమైన పాయింట్ల వద్ద దళాలను ఉంచడం ద్వారా వేగంగా మోహరించాలని నొక్కి చెప్పారు.వారికి సరైన మౌలిక వసతులను ఏర్పాటు చేయాలని ఏసీపీలను ఆదేశించారు. చెక్‌పోస్టుల వద్ద విధులు నిర్వర్తించే సమయంలో తగు జాగ్రత్తలు పాటించి ప్రజలకు అసౌకర్యం కలగకుండా చూడాలన్నారు. టీఎస్పీఐసీసీసీలో జరిగిన ఈ సమావేశంలో లా అండ్ ఆర్డర్ అడిషనల్ సీపీ విక్రమ్ సింగ్ మాన్,డిప్యూటీ కమీషనర్ శాంతన కృష్ణ, సీఏపీఎఫ్ కు చెందిన ఐదుగురు అసిస్టెంట్ కమాండంట్లు,11 కంపెనీల బలగాలు, అధికారులు పాల్గొన్నారు.