డార్క్ వెబ్ దందా ఎంత క్రేజీగా ఉంటుందో మనందరికీ తెలుసు. అదే సెలబ్రిటీల డేటా అయితే వావ్ అని ఎగిరి గంతేసేందుకు చాలామంది రెడీగా ఉంటారు. అందుకేనన్నట్టు హ్యాకర్లు ఎక్కువగా సెలబ్రిటీలపైనే ఫోకస్ పెడుతుంటారు. తాజాగా 40,00,00,000 మంది ట్విట్టర్ యూజర్ల డేటాను సేల్ కు పెట్టేశారు. ఇందులో బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ తోపాటు గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ట్విట్టర్ డేటా కూడా ఉండటం హైలైట్. హడ్సన్ రాక్ అనే ఇజ్రాయిల్ సంస్థ ఈ వివరాలు చెప్పేవరకూ ఎవరికీ తెలియదు. ఈ డేటాలో ఫోన్ నంబర్స్ కూడా ఉన్నాయి. మీకు గుర్తుందా సరిగ్గా 60 రోజుల క్రితమే 54 లక్షల ట్విట్టర్ యూజర్స్ డేటా ఇలాగే లీక్ అయిపోయింది. ఇప్పుడు మళ్లీ అదే రిపీట్ అవుతోంది. ఇక మనలాంటి సామాన్యుల డేటాకు ఎంత సెక్యూరిటీ ఉందో మీకు ఈపాటికే అర్థమైందిగా. మరి ఈ 40 కోట్ల మంది ట్విట్టరటీల్లో మీరూ ఉన్నారేమో చెక్ చేసుకుంటే మంచిది.
Sale: అమ్మకానికి సల్మాన్, సుందర్ పిచాయ్ ట్విట్టర్ డేటా
సంబంధిత వార్తలు | RELATED ARTICLES